Home » నల్లమబ్బులోన పార్ట్ 2 ( Nallamabbulona Part 2) సాంగ్ లిరిక్స్ – Love Failure Song

నల్లమబ్బులోన పార్ట్ 2 ( Nallamabbulona Part 2) సాంగ్ లిరిక్స్ – Love Failure Song

by Lakshmi Guradasi
0 comments

బాధగా ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా
చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా

పారేటి ఏరుల్లో ఈతలుగొట్టిన రోజులేడబాయె బుజ్జమ్మా
కురిసేటి వాన్నల్లో వడగళ్ళుబట్టిన జ్ఞాపకాలు మరువలేనమ్మా

గురుతులన్ని గుండెలోన గువ్వలాయెనే
గూడు వదిలి ఎంతకైన పోకపోయెనే
పంజరాన బంధీఐన పావురాయినే
రెక్కలుండి ఎగిరే…స్వేఛ్ఛలేకపోయెనే

బాధగా ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా
చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా

నింగిలో ఉన్నావనీ మేఘాల పల్లకి ఎక్కేసి నీకోసం ఎగిరీ రావాలా
చుక్కల్లో దాగావని మెరుపు జాడల్లోన విశ్వమంత తిరిగి అరచి పిలవాలా
రావని తెలిసిన రమ్మని పిలిచేటి పిచ్చోడినే నేను ఉయ్యాల
గోగుపూలు తెచ్చి గోరుముద్దలు పెట్టి వెన్నెలొస్తదంటె నమ్మాలా

నల్లమబ్బుల్లోన సల్లంగ కూసున్న సందామామా
ఈ రామయ్య బాధను సీతమ్మ చూసేటి రోజు ఏదమ్మా
తారల తోటల్లో కళకళలాడేటి జాబీలమ్మా
నా కళ్ళల్లో వెలుగులు వెలవెలబోతుంటె సూడవెందుకమ్మా

రావా రావా పిల్లా నువు రానే రావా పిల్లా
రావాలని ఆశ ఉండి రాకపోతివా
లేక సచ్చేదాకా రాకూడదని లెక్కరాసుకుంటివా

బాధగా ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా
చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా

నీ మువ్వ చప్పుళ్ళకు గలగల పారేటి గంగమ్మ పులకించి నాట్యం ఆడేనే
నీ ముసి నవ్వులకు మౌనంగ నిదురించె అడవి గొంతు విప్పి గానం పాడేనే

అల్లంత దూరాన అగుపిస్తున్న భామ అరిగోస పెడుతుందె గోపాల
ప్రాణాలు పోతుంటె చోద్యమె చూస్తుంది అంత కంటె పెద్ద పాపాలా

సందె పొద్దుల్లోన సిత్రంగ కురిసింది గాలీవానా
ఈ దీపాన్ని కాపాడి దేవత గుడిలోకి చేరుకోలేనా
మళ్ళి జన్మలోన నీ ప్రేమ పొందేటి వరమేదైనా
బిక్షమెయ్యమంటు దేవున్ని కోరుతు కన్నుమూస్తున్నా

వద్దే వద్దే పిల్లా నా పాడెను ముట్టొద్దె పిల్లా
కట్టెల్లో కాలేటి నా దేహమే చూసి కరిగిపోతివా
కన్నీళ్ళు కురిపిస్తు బూడిదపైనే… ప్రేమ పెంచుకుంటివా

బాధగా ఉందమ్మా గుండె బరువౌతుందమ్మా
చూడాలనుందమ్మా నిన్ను చేరాలనుందమ్మా

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment