Home » నక్క జిత్తులు – నీతి కథ

నక్క జిత్తులు – నీతి కథ

by Haseena SK
0 comment

అనగనగా ఓ అడవి. దానికి రాజు సింహం. నక్క కుందేలుతో అది  ఎంతో స్నేహంగా ఉండేది. వాటికి ఎటువంటి హనీ తలపెట్టేది కాదు. అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేలును తినేయాలని చూసేది. కానీ దానికి ఏవైనా కీడు తలపెడితే తనను సింహం బతకనివ్వదని ఆగిపోయేది ఎప్పుటికైనా అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూడసాగింది. ఇలా ఉండగా ఓ రోజు పరధ్యాంగా నడుస్తున్న సింహం కాలువలో ముల్లు దిగబడింది. తెల్లారేసరికే కాలు బాగా వాచిపోయింది. కుంటుతూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసిన నక్కను చాలా ఆనందం వేసింది. ఇక కుందేలును హాయిగా తినే యొచ్చుకుంనుకుంది. ఇంతలో నక్క రాజా మీరేం కంగారు పడొద్దు. మా స్నేహితులను వైద్యం తెలుసు. కాలిలో విరిగిన ముల్లును తీయడంలో వారిని మించిన వారు లేరు. వారంతా ఇక్కడికి కొద్ది దూరం లోనే ఉన్నారు. ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్లింది. ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు కుందేలు. సింహం కాలులో ఇరుక్కున్న ముల్లును తన పదునైన పళ్ల సాయంతో జాగ్రత్తగా తీసింది. కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్ర లేచి చూసింది రాజ ఇదిగోండి మీ కాలులోని ముల్లు అని చూపించింది. అరె భలే తీశావే అని మెచ్చుకుంది కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకుని వచ్చింది. అయ్యో నాకు నయమైంది. అయినా నా వైద్యం కోసం ఇంత మంది వైద్యులెందుకు అని సింహం అనబోతుండగానే- అదిగో ఆ సింహం సరిగా నడవలేదు మీరంతా దాడి చేసి దాన్ని తీనేయండి. నేనే మో ఈ. కుందేలును తింటాను అంది నక్కు. తినేయండి నేనేమో ఈ కుందేలును తింటాను అంది నక్కు దాని బుద్ధి బయట పడడంతో సింహం ముందు భాదపడింది. తర్వాత పట్టరాని కోపంతో నక్క  పైనా హైనాల పైనా వీరుచుకుపడింది. హైనాలు ఎలాగో పారిపోయాయి కానీ నక్క మాత్రం పంజా దెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment