వెలుగారునా.. నిశిపూసినా..
వెలివేసినా.. మది వీడునా..
గుండె కన్నుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైన
నిన్ను వదలకుమా వదలకుమా… బెదురెరుగని బలమా….
నదివే.. నువ్వు నదివే..
నీ మార్పే రానుంది వినవే..
నదివే.. నువ్వు నదివే..
నీకే నువ్వియ్యాలి విలువే..
సిలువ బరువేమోయకా
సులువు భవి తెలీదుగా
వెన్నెల వలదను కలువవు నువ్వు కావా.. కాలేవా..
ఓహో హో.. తడువు గురుతులై ఇలా..
తరుము గతమునావనా..
ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా
నటనిక చాలనే..ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం
నువ్వు వదలకుమా వదలకుమా… సరికోరే నిజమా….
నదివే.. నువ్వు నదివే..
నీ మార్పే రానుంది వినవే..
నదివే.. నువ్వు నదివే..
నీకే నువ్వియ్యాలి విలువే..
మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న
మునుముందే వెలుగుంది దారే ముసుగుపోతున్న
మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా
మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా
మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న
మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా
మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న
మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా..
నదివే..
In English Version..
Velugaarunaa.. nishipoosinaa..
Velivesinaa.. madi veedunaa..
Gunde kannumoosina vidhi raasina kala kaalipovu nijamaina
Ninnu vadalakumaa vadalakumaa… bedurerugani balamaa…
Nadhive.. nuvvu Nadhive..
Nee maarpe raanundi vinave..
Nadhive.. nuvvu Nadhive..
Neeke nuvviyyaali viluve..
Siluva baruvemoyakaa
Suluvu bhavi thelidugaa
Vennela valadanu kaluvavu nuvvu kaavaa.. kaalevaa..
Oho ho.. thaduvu guruthulai ilaa..
Tharumu gatamunaavanaa..
Etu kadalani nimisham nulimina gonthukavaa
Natanika chalaaney.. edha mosinaa kona oopirunna chaitanyam
Nuvvu vadalakumaa vadalakumaa… sarikore nijamaa…
Nadhive.. nuvvu Nadhive..
Nee maarpe raanundi vinave..
Nadhive.. nuvvu Nadhive..
Neeke nuvviyyaali viluve..
Munumundey velugundi ninnallo nishi daagunna
Munumundey velugundi daare musugu pothunna
Munumundey velugundi aagaddhu edeemainaa
Munumundey velugundi daatai aatu potainaa
Munumundey velugundi kalale vidoddantunna
Munumundey velugundi telupegaa harivillainaa
Munumundey velugundi unikini maruvaddantunna
Munumundey velugundi nee velugai nenosthunnaa..
Nadhive..
__________
Song Credits:
పాట: నదివే (Nadhive)
ఆల్బమ్/సినిమా: ది గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend)
నటీనటులు: రష్మిక మందన్న (Rashmika Mandanna), ధీక్షిత్ శెట్టి (Dheekshith Shetty)
సాహిత్యం: రాకేందు మౌళి (Rakendu Mouli)
రచన & దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)
నిర్మాతలు: విద్యా కొప్పినీడి (Vidya Koppineedi) & ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni)
సంగీతం & గానం: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
