Home » నా సెయ్యి పట్టుకోవా (Naa Seyyi Pattukova) సాంగ్ లిరిక్స్ | Ramu Rathod | Likhitha

నా సెయ్యి పట్టుకోవా (Naa Seyyi Pattukova) సాంగ్ లిరిక్స్ | Ramu Rathod | Likhitha

by Lakshmi Guradasi
0 comments
Naa Seyyi Pattukova song lyrics folk Ramu Rathod

Naa Seyyi Pattukova Song Lyrics Folk Ramu Rathod, Likhitha:

నా సెయ్యి పట్టుకోవా
అల్లేసుకుంటా నిన్ను ఓ బావ
పరువాలన్నీ పంచుకోవా
రాసిస్తానులేరా ఓ బావ

నీ సెయ్యి పట్టుకొనా
అల్లేసుకుంటా నిన్ను ఓ భామ
పరువాలన్నీ పంచుకొని
గుండెల్లా దాచుకుంటా దొరసాని

పట్టుకుందాం అంటే దొరకవ్ మళ్ళి
నా అందమంతా నీకే రారా మల్లి
హంసలాంటి నడుమున్న సిన్నదాన్ని
నే చెప్పేది వినవయ్య మల్లి మల్లి

నా సెయ్యి పట్టుకోవా
అల్లేసుకుంటా నిన్ను ఓ బావ
పరువాలన్నీ పంచుకోవా
రాసిస్తానులేరా ఓ బావ

ఓఓ ఓ.. ఓఓ ఓఓ
ఓఓ ఓ.. ఓఓ ఓఓ

ఆ..ఓ సూపైన సూసి పొర బావ
నా అందమంతా మూటగట్టుకోవా
కన్ను సైగతోనే కదే భామ
నన్ను తిప్పుకున్నావే నా ప్రేమ

నన్ను హత్తుకుని ముద్దులిచుకోవా
నే బిట్టుమని నిన్ను కట్టుకోనా
పిల్ల ఎత్తుకుని నిన్ను చుట్టుకొనా
నా ప్రేమ బాధ నీకు చెప్పుకొనా

నే పట్టుచీర కట్టుకున్న నీకోసమే
మల్లెపూలు పెట్టుకున్న నీకోసమే
అత్తరునే కొట్టుకున్న నీకోసమే
సాటు మాటు కబురంపే నీకోసమే

నా సెయ్యి పట్టుకోవా
అల్లేసుకుంటా నిన్ను ఓ బావ
నీ సెయ్యి పట్టుకొనా
అల్లేసుకుంటా నిన్ను ఓ భామ

నా వయ్యారమైన నడుము
చిన్న కవితైన చెప్పరాదే నువ్వు
నీ నడుము వంపుల్లో మలుపు
నడుమంటూ తీయ్ గుండె తలుపు

నా గుండెల్లో ఏదో బరువు
నువ్వు తాగగానే మురిసే నా తనువు
అబ్బా నీ ఒళ్లే పెద్ద కొలను
తీర్చుకుంటా నే కన్న కలను

ఈ మాటలన్నీ కాదురా ముద్దుల బావ
నీకోసం ఎదురుచూస్తున్న రావోయ్ బావ
ఒక్కసారి వచ్చి నువ్వు చూడోయ్ బావ
నిన్ను విడిసేదే లేదురా ముద్దుల బావ

నా సెయ్యి పట్టుకోవా
అల్లేసుకుంటా నిన్ను ఓ బావ
నీ సెయ్యి పట్టుకొనా
అల్లేసుకుంటా నిన్ను ఓ భామ

Song Credits:

సాంగ్ : నా సెయ్యి పట్టుకోవా (Naa Seyyi Pattukova)
నటీనటులు: రాము రాథోడ్ (Ramu Rathod), లిఖిత (Likhitha)
గాయకులు: శ్రీనిధి – రాము రాథోడ్ (SRINIDHI – RAMU RATHOD)
సాహిత్యం: భరత్ మజోజు (BHARATH MAJOJU)
సంగీతం: నవీన్ జె (NAVEEN J)
కొరియోగ్రఫీ: శేఖర్ వైరస్ (SHEKAR VIRUS)
నిర్మాతలు: అనూష – అంజలి (ANUSHA – ANJALI)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.