నా పేరు నరసింహ (Naa peru Narasimha) సాంగ్ లిరిక్స్ – నరసింహ (Narasimha) | TeluguReaders 

by Manasa Kundurthi

సింగమల్లే నువ్వు శిఖరము చేరు….
శిఖరము చేరి నింగిని కోరు…..

నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన

చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేన్ మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ్య
మేలు మరచిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా

సింగమల్లే నువ్వు శిఖరము చేరు..
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన

చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేన్ మీసమున్న బాలుడయ్యా

కోట్ల కోట్ల విలువ చేసే ఆస్తి పాస్తులొద్దు
బిరుదులెన్నో తెచ్చిపెట్టు పదవులు వద్దు
దండలు వేయొద్దు… మణి మకుటాలసలొద్దు
నా జన్మ భూమి ప్రేమ చాలు లే…

నా గోరంత చమటకు
కొండంత సిరులిచ్చి పెంచినది ప్రజలే కదా
నా తనువును ధనమును
ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా

సింగమల్లే నువ్వు శిఖరము చేరు…
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన

చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేన్ మీసమున్న బాలుడయ్యా

నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు
చరితగా మారే స్థాయికి ఎదుగు
నీలో శక్తి ఉన్నది
దాన్ని పదును పెడితే ఫలితమున్నది
మంచి రోజు రేపే ఆరంభించావా..

అరేయ్ ఎవరి గుణం ఏవిటో
ఎవరి బలం ఏవిటో
చూసింది ఎవరంటా
అరే విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట
కొంత కాలం ఆగమంట

సింగమల్లే నువ్వు శిఖరము చేరు….
శిఖరము చేరి నింగిని కోరు….

నా పేరు నరసింహ
ఇంటిపేరు రాణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
నరసింహ నరసింహ నరసింహ నరసింహ
చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేన్ మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ్య
మేలు మరచిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా

సింగమల్లే నువ్వు శిఖరము చేరు..
శిఖరము చేరి నింగిని కోరు….. హోయ్

______________________

సాంగ్: నరసింహ (Narasimha)
గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam)
సాహిత్యం: శివ గణేష్ (Siva Ganesh), A.M.రత్నం (A.M.Rathnam)
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Stay Informed, Stay Inspired

Subscribe to Our Newsletter for the Latest Trends and Tips!

@2025 u2013 All Right Reserved. Designed and Developed by PenciDesign