నాటు మెల్లెలే నాగ మల్లెలే ఓరు మల్లెలే
జాజి మల్లెలే బొండు మల్లెలే కుండ మల్లెలే
రమణ నీ మల్లి
నాటు మల్లి నాగ మల్లి ఓరు మల్లి
జాజి మల్లి గుండు మల్లి కొండ మల్లిరో నా మల్లి
మరుమల్లి అందాల పాలవెల్లిరో
రమణ నంచొద్దు
వెళ్లిపోతుందిరా మల్లి
చిన్నారి నా గుండెను గిల్లి
అందంగా నవ్వే సిరిమల్లి
చేసింది నా గుండెల లొల్లి
నా మల్లి మోర మల్లి అందాల పాలవెల్లిరో..
వెళ్లిపోతుందిరా మల్లి
చిన్నారి నా గుండెను గిల్లి
అందంగా నవ్వే సిరిమల్లి
చేసింది నా గుండెల లొల్లి
నేతిమీద బుట్ట పెట్టి బుట్టలోన పూలు పెట్టి
జాజిపూల మాల కట్టి జడలోన ముడిచి పెట్టి
మూడు ముర్ల చీర కట్టి ముచ్చటగా దోపి పెట్టి
సిపాను రైక కట్టి సింగపూర్ సెంటు కొట్టి
ఒంపు సొంపులన్నీ పైట చాటున దాచి పెట్టి
కొంటె మనసుల్ని చిన్న చూపుతో కొల్లగొట్టి
చిన్నారి చిట్టి గారల పట్టి కళ్ళని గోట్టి
కలవర పెట్టి పెట్టి పెట్టి పెట్టి
వెళ్లిపోతుందిరా మల్లి
చిన్నారి నా గుండెను గిల్లి
అందంగా నవ్వే సిరిమల్లి
చేసింది నా గుండెల లొల్లి
బుట్టనే పక్కనెట్టి నాలుకే మడతపెట్టి
ఒక్క ఈలనే కొట్టి పాటకే చిందులు పెట్టి
మావననే ఆశపెట్టి చెవిలోను చుట్టపేట్టి
పిడకల నన్నే కొట్టి ఇరిసేసి పొయలెట్టి
కనుసైగతోనే గుండె గదికి తాళంపెట్టి
చిన్న నవ్వుతోనే నా మనసకు చిల్లులు పెట్టి
పొన్నార కుట్టి అందాల కుట్టి జాల్లోన పొట్టి
నాటెట్లో నెట్టి నెట్టి నెట్టి నెట్టి
అందంగా నవ్వే సిరిమల్లి
చేసావే నా గుండెల లొల్లి
గుండెల్లో గుడి కడతా మల్లి
పదిలంగా ఉండావే నువెళ్ళి
సాంగ్ క్రెడిట్స్ :
గాయకుడు: పల్సర్ బైక్ రమణ (Pulsar Bike Ramana)
ట్యూన్ & లిరిక్స్: ఈశ్వర్ తాళ్లపూడి (Eswar Tallapudi)
సంగీతం & మిక్సింగ్: గణేష్ జాన్ బ్రదర్స్ (Ganesh Jhon Brothers)
కళాకారులు : పల్సర్ బైక్ రమణ (Pulsar bike ramana), గాయత్రి (Gayathri), ఆర్ పిడి రాజు (R Pydi Raju)
నిర్మాత: ఉమా మహేశ్వరి (Uma maheswari)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.