నా చిన్ని లోకమే చెజారిపోయేనె
నా కలల వెలుగులే అదృశ్యమాయినె
తారాల తీరమే దూరంగా మెరిసెనె
రాగాల కోయిలే గానాన్నే మరిచెనె
ఎదురుగా మొలిచిన ప్రశ్న నేనెనా
నిజమని తెలిసిన కన్ను మూసెనా
ఎందుకో ఏమిటో తెలియలేకున్నా
ఎవరిదో మెప్పుకో వెచ్చి చూస్తున్నానా
రేపు పిలవదా వెచ్చి చూడగా నీది నీదేగా పోనె పొదుగా
నీవు కాని నువ్వు నీలో ఉంది చూడు
తనని వదిలి చూడు కొత్త అడుగు ఆగనందిగా…
నా చిన్ని లోకమే చెజారిపోయెనె
నా కలల వెలుగులే అదృశ్యమాయినె
ఈ సామరమగునా గాయాలు మానునా
ఈ బాధ కరుగునా మౌనాలు పలుకునా
కన్నీళ్లూ ఆగునా ఆరాలు మొయనా
సంకెల్లు తొలుగునా నాకు నె దొరుకునా
పదమని, వినమని చెప్పు నువ్వైన
తరగని, చెదరని ముసుగు తీసేయ్నా
యుద్ధమే లోపలే నాకు నాతోన
ఎవరిదో ఓటమే వెచ్చి చూస్తున్నానా
చిన్న జీవితం గడుపు స్వేచ్ఛగా
ఉన్న బాధని మరువు పూర్తిగా
నీవు కాని నువ్వు నీలో ఉంది చూడు
తనని వదిలి చూడు కొత్త అడుగు ఆగనందిగా…
నా చిన్ని లోకమే చెజారిపోయెనె
నా కలల వెలుగులే అదృశ్యమాయినె
సాంగ్ క్రెడిట్స్ :
పాట – నా చిన్ని లోకమే (Naa Chinni Lokame)
సాహిత్యం – నీరజ కోన (Neeraja Kona)
గాయకులు – అదితి భావరాజు (Aditi Bhavaraju) & రమ్య బెహ్రా (Ramya Behra) & శ్రీ కృష్ణ (Sri Krishna)
నటీనటులు – కీర్తి సురేష్ (Keerthy Suresh),
సంగీతం – థమన్ ఎస్ (Thaman S)
దర్శకత్వం – నరేంద్ర నాథ్ (Narendra Nath)
నిర్మాత – మహేష్ ఎస్ కోనేరు (Mahesh S Koneru)
రచన – నరేంద్ర నాథ్ (Narendra Nath), తరుణ్ (Tharun)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.