నా కంటిపాప కంటి సెమ్మను తాకలేదమ్మా..
నీ రెక్కల కష్టంలా
నా కంటిపాప కంటి సెమ్మను తాకలేదమ్మా..
నీ రెక్కల కష్టంలా
చిన్ననాటి చిన్ని అడుగుల తోడు నీవమ్మా
నాలో ప్రాణం నీదమ్మా
ఆ చెట్టు కొమ్మల ఉయ్యాలనీ చేతులతో ఊగినా
నీ గోరు ముద్దల మధురిమా ఎన్ని జన్మలెత్తగా దొరుకునో
నీ పాదాల పలు మార్లు కడిగే నీటి సుక్కగా మారన అమ్మ మారన
నీ పాదాల పలు మార్లు తాకిన నీ రుణము తీరున తీరునా… అమ్మ తీరునా
నీ పురిటి నొప్పుల భాదకి నేనిచ్చే బదులేమున్నదే
పసినవ్వు చూసే యాలకి కష్టాన్ని మరిసిపోతివో
నీ గర్భ గుడిలో పెరిగినా…
నిలువెత్తు ప్రేమగా పుట్టినా…
నీ గర్భ గుడిలో పెరిగినా నిలువెత్తు ప్రేమగా పుట్టినా
నీ జోల పాటను వింటూనే నీ కన్నా ప్రేమను చూసినా
నీ పాదాల పలు మార్లు కడిగే నీటి సుక్కగా మారన అమ్మ మారన
నీ పాదాల పలు మార్లు తాకిన నీ రుణము తీరున తీరునా… అమ్మ తీరునా
నడి రాతిరి నీ కునుకును ఏ భాద తట్టి లేపెనో
నీ కన్నుల కన్నీళ్లను సీనుకుల దారై కదిపేనో
నీ గుండెపైన వాలినా…
నీ గోసలెన్నో విన్నానో…
నీ గుండెపైన వాలినా నీ గోసలెన్నో విన్నానో
నా ఊహ తెలియక ఇడిసిన నీ భాదల అర్ధం తెలియక
నీ పాదాల పలు మార్లు కడిగే నీటి సుక్కగా మారన అమ్మ మారన
నీ పాదాల పలు మార్లు తాకిన నీ రుణము తీరున తీరునా… అమ్మ తీరునా
___________
దర్శకుడు – కాన్సెప్ట్ – వూటూకూరి శ్రావణ్ కుమార్ (VUTUKURI SRAVAN KUMAR)
నటీనటులు – జానులిరి (Janulyri) -మైనం యెల్లేష్ (MAINAM YELLESH)
గాయకులు – దిలీప్ దేవగన్ (DILIP DEVGAN)
రచయిత – రమేష్ పగిల్లా (RAMESH PAGILLA)
సంగీతం – రమేష్ తుడిమిళ్ల (RAMESH PAGILLA)
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!