అగొ అల్లి పులా వాసనరా
సాయిగా నీ అంగీలా
ఎవతి ఇంట్ల సచ్చినావ్
ఎవతిని నువ్ గిచ్చినావ్
అవ్వతోడు ఎక్కడిదే
అల్లి పులా వాసన
నంగతనం చేస్తిన
గంగతనం చేతున
నా మనసు మీద లవ్ ఆడిన రా నిన్ను
నమ్ముకున్న నిన్ను ఇంకోదాని పైన కన్ను
అగొ ముట్టుడైతివిర సాయి ముట్టుడైతివి
మూల కున్న దాన్ని నన్ను ముంగటెస్తివి
ముట్టుడైతివిర సాయి ముట్టుడైతివి
మూల కున్న దాన్ని నన్ను ముంగటెస్తివి
అగొ తెల్ల మల్లె పువ్వులు రా
సాయి గా నీ జేబు లా
దేని జడల అల్లినవ్
ఏ సందుల కెళ్ళినవ్
అయ్యా తోడు ఎక్కడియే తెల్ల మల్లె పువ్వులు
అగొ యాల పొతున్న గుద్దుకుని నేను సత్తున్న
నీ కర్ర మాకల మన్ను
ఆగం చేస్తివి నన్ను
ఇగ బతకర నేను
ఏదైతే గదే గాను
అగొ ముట్టుడైతివిర సాయి ముట్టుడైతివి
మూల కున్న దాన్ని నన్ను ముంగటెస్తివి
ముట్టుడైతివిర సాయి ముట్టుడైతివి
మూల కున్న దాన్ని నన్ను ముంగటెస్తివి
అగొ వట్టి చేపల వాసనరా
సాయిగా నీ మూతిలా
ఏ బొందల వట్టినవ్
నీ బొత్తల నెట్టినవ్
నీ తోడు ఎక్కడిదే ఎట్టి చేపల వాసనరా
బయలో పడి చాస్తున్న బండకేసి దీన్ని గుద్దున్న
నా మేన మామవని అరె గోస పెట్టిన గాని
నా వోడే అనుకొని నెనూరుకున్న గాని
అగొ ముట్టుడైతివిర సాయి ముట్టుడైతివి
మూల కున్న దాన్ని నన్ను ముంగటెస్తివి
ముట్టుడైతివిర సాయి ముట్టుడైతివి
మూల కున్న దాన్ని నన్ను ముంగటెస్తివి
పచ్చ నాకు పట్టుకోరా నీ చేతిలా
లంగతనం చేయని జౌడల జోలు పోనని
చేతిలో చెయ్యి వెత్తినమ్మా
నిన్ను విడువ బోనని
పచ్చ నాకు పట్టిన
ఒట్టు నీకు పెట్టిన
మంది మీద మన్ను
మన మీదనే రా కన్ను
మనువాడు కోర నన్ను
నా పెనీవిటి రా నువ్వు
ముట్టుడైతివిర సాయి ముట్టుడైతివి
ఏనాడో నన్ను ముట్టి ముట్టుడైతివి
ఒక్కటైతిమి రా సాయి ఒక్కటైతిమి
ఎలు పట్టుకున్న నాడే ఒక్కటైతిమి
_____________________________________
సంగీత దర్శకుడు – ఇంద్రజిత్ (Indrajitt )
లిరిక్ – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
గాయకులు – దిలీప్ దేవగన్ (Dilip Devgan), ప్రభ (Prabha)
నటీనటులు – దిలీప్ దేవగన్ (Dilip Devgan), మౌనిక డింపుల్ (Mounika Dimple), రితిక (Rithika)
దర్శకుడు & కొరియోగ్రఫీ – రాజేష్ జాగ్వార్ (Rajesh Jaguar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.