Home » ముసలి ఎద్దు – నీతి కథ

ముసలి ఎద్దు – నీతి కథ

by Rahila SK
0 comments
musali eddhu neethi katha

వెంకయ్య అనే రైతు దెగర ఒక ఎద్దు ఉండేది. అది వామసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి, బండిలాగి వెంకయ్యకు ఎంతో సామంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒక నాడు సంతకు వెళ్ళి బాగా విలాసంగా ఉంది, వయసులో ఉన్నవేరోక ఎద్దును కొన్నాడు వెంకయ్య. అప్పటినుంచి దానికి దండిగా మేత వేసి, కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డి వేసి ఊరుకొనేవాడు.

క్రమంగా అది కూడా దండగ అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్నముసలి ఎద్దును విప్పి నీకు పని చేసే వయసు అయిపోయింది ఇంక నీకు శక్తీ లేదు అని…ఇక నీకు నాకు దండగ అని చెప్పాడు వెంకయ్య. ని దారి నీవు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు. ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడిగాదు. గోపన్న ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి ఈ ఎద్దు నీదే కదా అని అడిగాడు…అవునన్నాడు వెంకయ్య దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యివరహాలు ఇస్తును ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా నీకు తెలియదా ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వేస్తుంది అని చెప్పాడు వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని నాటినుండి దానికి మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళవాడు. ఆఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పడడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబర పడ్డాడు వెంకయ్య.

కథ యొక్క నీతి: కొన్నిసార్లు మూడనమ్మకాలు కూడా మేలుచేస్తాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.