కావలసిన పదార్థాలు:
- మునగాకు – 2 కప్పులు
- శనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు
- మినపప్పు – 2 టేబుల్ స్పూన్లు
- ఎండుమిర్చి – 4 లేదా 5
- పచ్చికొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు
- చింతపండు – 5 గ్రా
- ఆవాలు – 1 టీ స్పూన్
- జీలకర్ర – 1 టీ స్పూన్
- కరివేపాకు – 1 రెమ్మ
- జీడిపప్పు – 5
- ఉప్పు – తగినంత
తయారీ విధానం:
ముందుగా మునగాకు ని తీసుకుని శుభ్రం గా కడిగి తడి పోయే వరకు దాని జల్లిలో వేసి ఉంచాలి. లేదా కాటన్ క్లాత్ పైన వేసి కూడా పక్కన ఉంచుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొన్ని పక్కన పెట్టకోవాలి. మరో గిన్నె పెట్టి దానిలో మునగాకు మరియు చింతపండు వేసి ఉడికించాలి. మునగాకు ఉడికాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాని బాగా చల్లా రానివాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని చల్లారినించిన మునగాకు, కొబ్బరి తురుము, ఎండుమిర్చి ఉప్పు వేసి రుబ్బుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మల్లి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు వేసి కలపాలి. ఈ లోపు రుబ్బుకున్న పచ్చడిని వేసి కలపాలి. అంతే మునగాకు పచ్చడి రేడి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.