Home » కజ్జికాయాలు-తయారీ విధానము

కజ్జికాయాలు-తయారీ విధానము

by Manasa Kundurthi
0 comment
64

ఇంట్లోనే హెల్తీగా మరియు టేస్టీ టేస్టీగా కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. కజ్జికాయలు భారతదేశమున లభ్యమయ్యే ఒకరకమైన మిఠాయిలు.

కావలసిన పదార్థములు:

  1. శనగపప్పు
  2. గోధుమ పిండి (లేదా) మైదా
  3. నూనె
  4. ఉప్పు
  5. పంచదార (లేదా) బెల్లం
  6. యాలకులు
  7. ఎండు కొబ్బరి తురుము

తయారీ విధానము:

kajjikayalu sweet making process

మొదటి దశ:

మొదటగా గోధుమ పిండి (లేదా) మైదా పిండిని, తగినంత ఉప్పును ఒక బౌల్లో వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ, అలాగే కొంచెం నూనెను వేసుకుని ఒక మెత్తటి ముద్దగా చేసి, ఒక పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, పంచదార (లేదా) బెల్లం, యాలకులు వీటిని అన్నింటిని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దను, చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా చేసుకుని, వాటిని ఒక్కొకటిగా రౌండ్ షేప్ లో చపాతీ కర్రతో (చపాతీలా) రుద్దుకోవాలి.

రెండవ దశ:

ఇప్పుడు మనం ముందుగా తయారుచేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఎండు కొబ్బరి తురుమును కలుపుకోవాలి. ఆ తర్వాత రౌండ్ షేప్ లో రుద్దుకున్న వాటిలో, శనగపిండి మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకుని, వాటిని అర్ధ చంద్రాకారంగా ముడుచుకుని కజ్జికాయల లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని, అందులో డీఫ్రైకి సరిపడ నూనెను పోసుకొని, అది వేడెక్కాక అందులో మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. అవి మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయినుంచుకొని, ఒక బౌల్లో సర్వ్చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కరకరలాడే కజ్జికాయలు రెడీ!

అధికంగా వినియోగించు ప్రదేశాలు:

ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును. ప్రస్తుతం ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరకుతున్నవి.

రకాలు:

  • కోవా కజ్జికాయలు
  • గోధుమ రవ్వ కజ్జికాయ (కుస్లీ)
  • డ్రైఫ్రూట్‌ కజ్జికాయలు

ముగింపు:

ఇంట్లోనే వీసీగా మరియు హెల్తీగా, రెడీ చేసుకోవడానికి అనువుగా వుండే కజ్జికాయల రెసిపీ. మరిన్ని వంటకాలకు తెలుగు రీడర్స్ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version