జంగమో నా లింగమా….
కొప్పులో గంగమ్మ పక్కన పార్వతి
సక్కంగ నువురారో శివుడో నేను మొక్కంగ దిగిరార శివుడో …
సక్కంగ నువురారో శివుడో నేను మొక్కంగ దిగిరార శివుడో…
మన్ను నువ్వేనంట మిన్ను నువ్వేనంట
నన్ను నడుపే నాగ నటరాజు నువంటా…..
సక్కంగ నువురారో శివుడో నేను మొక్కంగ దిగిరార శివుడా…
అన్ని నువ్వెనంట శివుడో… లోకమంత నువేనంట శివుడా….
వెండి కొండలవాడ ఏలేటి వేములాడ
గుండంలో స్నానాలు గుడిసుట్టు దండాలు
కోల్లేగా ముడుపులు కొటక్క మొక్కులు…
కోల్లేగా ముడుపులు కొటక్క మొక్కులు…
ముడు కన్నులవాడ శివుడో… ముజ్జేగాలేలేటి బోలశంకరుడా…
అన్నీ నువెనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడా…
ముడు కన్నులవాడ శివుడో… ముజ్జేగాలేలేటి బోలశంకరుడా…
అన్నీ నువెనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడా…
ఈసై లోకాన గోసలు ఎడబాప
కాశినే కైలాస గిరులు చేసుకొని
వచ్చిపోయేటోళ్ళ సుట్టమైనావట …
వచ్చిపోయేటోళ్ళ సుట్టమైనావట…
కోటిలింగాలల్ల శివుడో… కొలువై కాపు కస్తున్నావా శివుడా…
అన్నీనువెనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడా…
కోటిలింగాలల్ల శివుడో… కొలువై కాపు కస్తున్నావా శివుడా…
అన్నీనువెనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడా..
శ్రీశైల శిఖరాన సిరీగల్ల దేవుడా
గంగ గౌరిలోను నా ప్రాణానందుడా
సృష్టినిఆడించే ఓ దేవదేవుడా…
సృష్టినిఆడించే ఓ దేవదేవుడా…
పల్లజడల స్వామి శివుడో పాపాలు కడిగి వెసేటి ఈశ్వరుడా
అన్నీ నువెనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడా…
పల్లజడల స్వామి శివుడో పాపాలు కడిగి వెసేటి ఈశ్వరుడా
అన్నీ నువెనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడా…
జంగమో…. నా లింగామా…..
ఏందేందు చూసిన అందందు నువ్వట
అండపిండ బ్రహ్మాండమే నీదట
ఆది అంతాలకు అద్యుడు నువ్వట…
ఆది అంతాలకు అద్యుడు నువ్వట…
అంతమేలేనోడా శివుడో అంతాట నీవై ఉన్నోడ శివుడో …
అన్నినువ్వేనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడో …
అంతమేలేనోడా శివుడో అంతాట నీవై ఉన్నోడ శివుడో …
అన్నినువ్వేనంట శివుడో లోకమంత నువ్వేనంట శివుడో …
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.