Nagadurga Mudivesukuntaaro song lyrics Folk:
వెన్నెల కురిసింది వయ్యారంగా
చీకటి మురిసింది సింగారంగా
సందేల పొద్దులలో వాని ముద్దుల సూపులలో
నల్లని మిణుగుర్ల నవ్వులల్లా
నిండుగా విరిసినా పువ్వులల్లా
బంగారు నీవంటడు వాని బంధాలు కలుపుతాడు
వద్దన్న గుండెల్లో సేరి వాడు
వద్దన్న గుండెల్లో సేరి వాడు
అద్దంలా నా ముందు నిలుసుంటడు
ఓ పిల్ల నీ మీద మనసంటడు
ముడివేసుకుంటారో…
నిన్ను ముద్దుల కొంగుకు మూట గట్టి
కట్టేసుకుంటారో..
నిన్ను కాల్వల మందార మాల కట్టి
ముడివేసుకుంటారో…
నిన్ను ముద్దుల కొంగుకు మూట గట్టి
కట్టేసుకుంటారో..
నిన్ను కాల్వల మందార మాల కట్టి
చక్కున మెరిసేటి చమ్కీలల్లా
అత్తర్లు ఒలికేటి అందలల్లా
బుల్లెట్లో వస్తుంటాడు telugureaders.com
బంగారు బిస్కట్ ల వస్తుంటాడు
మన్మధ మందార సోకులల్లా
మలి సంధ్య కిరణాల గడియలల్లా
దారుల్లో దాగుంటాడు
మాటల్లా మాయేదో చేస్తుంటాడు
నిద్దర్లో కండ్లలో దూరి వాడు
నిద్దర్లో కండ్లలో దూరి వాడు
నైట్ అంత జాగరమైతుంటాడు
తెల్లారేగట్లల్లా పోతుంటాడు
ముడివేసుకుంటారో…
నిన్ను ముద్దుల కొంగుకు మూట గట్టి
కట్టేసుకుంటారో..
నిన్ను కాల్వల మందార మాల కట్టి
ముడివేసుకుంటారో…
నిన్ను ముద్దుల కొంగుకు మూట గట్టి
కట్టేసుకుంటారో..
నిన్ను కాల్వల మందార మాల కట్టి
పూసలు కదిలేటి చూపులల్లా
మీసాలు మెలివేసి వీధులల్లా
జోరుంగా పోతుంటాడు
పిల్లగాని తీరే వేరుంటాడు
రంగుల హరివిల్లు తీరాలల్లా
రత్నాల పగడాల రాసులల్లా
నీ సాటి లేదంటాడు
అందాల రాకాసి నువ్వంటాడు
పోదంతా చూడంగా మురిసి వాడు
పోదంతా చూడంగా మురిసి వాడు
ఓ పిల్ల నీ మీద ప్రేమంటాడు
ఒడిలోన గుట్టుంగా కుసుంటాడు
ముడివేసుకుంటారో…
నిన్ను ముద్దుల కొంగుకు మూట గట్టి
కట్టేసుకుంటారో..
నిన్ను కాల్వల మందార మాల కట్టి
ముడివేసుకుంటారో…
నిన్ను ముద్దుల కొంగుకు మూట గట్టి
కట్టేసుకుంటారో..
నిన్ను కాల్వల మందార మాల కట్టి
నింగిలో సుక్కల్లో వడిసెయాల
నేలంతా చినుకుల్లో తడిసెయాల
ఎదురుంగా వాడుంటాడు
ఎద మీద చలి కాసుకోమంటాడు
వేసంగి మేఘాల పైరులల్లా
బాసింగా బలగాల రాసులల్లా
మనం ఈడు జొడంటాడు
పిలగాడు మనువాడా సై అంటాడు
అడుగుల్లా నా ఏంటా నడిచి వాడు
అడుగుల్లా నా ఏంటా నడిచి వాడు
ఏడేడు జన్మల తోడుంటాడు
ఎదురుంగా నువ్వుంటే చాలంటాడు
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
నటి: నాగదుర్గ (NAGADURGA)
గాయని: శ్రీనిధి నరేళ్ల (SRINIDHI NARELLA)
కాన్సెప్ట్ డైరెక్షన్ : బి.చంద్రు (B.CHANDDU)
నిర్మాత: మధుబాల (MADHUBALA)
సాహిత్యం: మహేందర్ ముల్కల (MAHENDAR MULKALA)
సంగీతం: కళ్యాణ్ కీస్ (KALYAN KEYS)
కొరియోగ్రఫీ: శేఖర్ వైరస్ (SHEKHAR VIRUS)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.