ఆ ముత్యాల ముగ్గుల్లో
ఆ రతనాల గొబ్బిళ్ళో
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి…. విరబూసే
మహదండిగా మదినిండాగా
చలి పండుగే సంక్రాంతి
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
అత్తింట సాగుతున్న అల్లుళ్ళ ఆగడాలు భోగి పళ్ళుగా
కంగారు రేపుతున్న కోడళ్ల చూపులన్నీ భోగిమంటగా
ఉన్నమాట పైకి చెప్పు అక్కగారి వైనమేమో సన్నాయిగా
దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా
పిల్లాపాపలే పచ్చతోరణాలుగా
పాలనవ్వులే పచ్చి పాయసాలుగా
కలబోసి… తెరతీసి
కనువిందుగా మనకందినా
సిరిసంపదే సంక్రాంతి
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
మనసును చూసే కన్నులు ఉంటె
పగలే వెన్నెల రాదా
మమతలు పూసే బంధాలుంటే
ఇల్లే కోవెల కాదా
మన అనువాళ్లే నలుగురు ఉంటె
దినము కనుమె కాదా
దేవతలేని దేవుడు నీవు ఇలా చేరావు
కనలేని కొనలేని… అనురాగమే
నువ్వు పంచగ అరుదెంచాదా సుఖశాంతి
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
కలబోసి… విరబూసే
మహదండిగా మదినిండగా
చలి పండుగే సంక్రాంతి
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు
_____________________________
పాట: ముద్ద బంతులు (Mudda Banthulu)
చిత్రం: పండగ (Pandaga)
లిరిసిస్ట్: చంద్రబోస్ (Chandrabose)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani)
గాయకులు: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam), K.S. చిత్ర (K.S. Chitra)
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao), రాశి (Raasi), శ్రీకాంత్ (Srikanth)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.