సంద్రంలో కెరటంలా అలుపే ఎరుగని అనురాగం
హృదయంలో ఉదయంలా వెలుగే నింపిన తొలి కిరణం
స్వార్ధమే తెలియని ప్రేమల పరమార్ధమేలే ఈ కధనం
చూస్తే ఈ అనుబంధము మురిసే గగనము భువనము
ముచ్చటగ బంధాలే ఇచ్చటనే కలిసాయే
దైవమే విధిలా వేసేడంటా గీతనే
చరితయే కథలోని చెరిసగం వీరేలే
చెరగని స్మృతులై పయనంతో సాగించెలే
సంద్రంలో కెరటంలా అలుపే ఎరుగని అనురాగం
హృదయంలో ఉదయంలా వెలుగే నింపిన తొలి కిరణం
నీలాకాశం లోని రంగుల హరివిల్లై
పొంగిందేమో ప్రేమే ఇరువురిలో నిత్యం
ఇంకో జన్మే ఉన్నాగాని ఈ పాశం
సరితూగేనా రుణమై ఇస్తే సర్వస్వం
మమతలు కొలువైన నిలయం
మగతలు రానివ్వని వైనం
చూస్తే ఈ అనుబంధము మురిసే గగనము భువనము
ముచ్చటగ బంధాలే ఇచ్చటనే కలిసాయే
దైవమే విధిలా వేసేడంటా గీతనే
చరితయే కథలోని చెరిసగం వీరేలే
చెరగని స్మృతులై పయనంతో సాగించెలే
సంద్రంలో కెరటంలా అలుపే ఎరుగని అనురాగం
హృదయంలో ఉదయంలా వెలుగే నింపిన తొలి కిరణం
పాట పేరు: ముచ్చటగా బంధాలే (Muchataga Bandhaale)
సినిమా పేరు: అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (ARJUN S/O VYJAYANTHI)
గానం: హరిచరణ్ (Haricharan)
సాహిత్యం: రఘు రామ్ (Raghu Ram)
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath)
రచయిత & దర్శకుడు: ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri)
👉 మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ సందర్శించండి.