Home » ఎందరో అమ్మల నిజమైన  – నీతి కథ

ఎందరో అమ్మల నిజమైన  – నీతి కథ

by Vishnu Veera
0 comment

కొని నెలల క్రితం కొత్తగా మా ఇంట్లో ఒక పనిమనిషి చేరింది. ఆవిడ పేరు శివమ్మ. మూడు నాలుగు రోజుల గడిచిన తరువాత ఒక రోజు శివమ్మ తో ఇలా అడిగాను. శివమ్మ నీవు ఎక్కడ ఉంటావు. నీకు పిల్లలు ఎంతమంది అని అడిగాను. శివమ్మ నాకు ముగ్గురు అమ్మాయిలు సార్ అని చెప్పింది. పెళ్లిళ్లు అయ్యాయా అని అడిగాను లేదు సార్ ఇంకా చదువుతున్నారు. ఏమి
చదువుకుంటున్నారు అని ఊరికే అడిగాను. అప్పుడు శివమ్మ పెద్ద అమ్మాయి MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ లెక్చరర్ గా చేస్తుంది. ఆ మాట పనిమనిషి శివమ్మ చపగానే ఆచార్యా పోయాను. రెండో అమ్మాయి MCA కంప్యూటర్స్ మొదటి సంవత్సరం. మూడో అమ్మాయి MBBS రెండొవ సంవత్సరం. మల్లి ఆచార్య పోయాను. మూడో అమ్మయి నర్సింగ్ గా అన్నాను. కాదు సార్ MBBS అని చెపుతుంది. నాకు అర్ధం కావడం లేదు.ఈవిడ ఏం మాట్లాడుతుందో అర్ధం కావడం లేదు. మల్లి అడిగాను అదే సమాధానం చెపుతుంది. MBBS ఫ్రీ సీట్ అని అడిగాను. అవును సార్ ఫ్రీ సిట్ ఏదో బిల్డింగ్ ఫీజ్ అంటా ఆ ఫ్రీజ్ కోసం తంటాలు పడుతున్నారు. ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా, మీ పిల్లలు అని అడిగాను. ఇక్కడే ఉన్న వీధి బడిలో పదో తరగతి వరకు చదువుకున్నారు సార్ అని చెపింది. “పై” చదువులకు బయట పట్టణాలకు పంపించావా అని అడిగాను. లేదు సార్ మాములుగా మన ఊరిలో ఉన్న ప్రేవేట్ కాలేజ్ లో చదువుకుంది. నాకు ఈ చదువు గోల నాకు ఏమీ తెలియదు అయ్యా అని చెప్పకువచ్చేంది. ఏం చదువు కునావు అమ్మ నువ్వు అని అడిగాను. రెండో తరగతి లో బడికి పోవడం మానేసాను. నాకు కూడికలు తీసివేతకు కూడా రావు. చాల కష్టాలుపడను పిల్లలను ఈ స్థాయి తీసుకునిరావడానికి. మీ అయన ఏం చేస్తాడు అని అడిగాను. ఆయనకు అందరిలాగే ఇంటి విషయాలు ఏం పాటించుకోడు. అయన తాగుతాడు రోజుకు వందరూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. కానీ ఇపుడు ఇపుడు మారుతున్నాడు. పాప డాక్టర్ కోర్స్ చేరిన తరువాత. మా పెద్దఅమ్మాయి ఎడొవ తరగతి చదువు మనిపెంచేసాను. కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి స్కూల్ కి తీసుకొని వెలింది. పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది.ఎలాగో కింద మీద పడుతున్నాను అని చెపింది. ఒక చదువుకొని మహిళా భర్త తాగుబోతు ఇంత కష్టపడి పిల్లలలును వృది లోకి తెచ్చింది. లక్షలు లక్షలు ఫ్రీజులు కడుతుంటే వీళ్ళు చదువు కోవడం లేదు. నా పిల్లలు వీల లో సగం చదువుకుంటే చాలు అనుకున్నాను. నేను మీ ముగ్గురు అమ్మాయి లతో మాట్లాడాలి.ఒకసారి తీసుకొని రా మీ పిల్లలని అని చెప్పాను. నేను చెపిన మాట విని సాయంత్రం శివమ్మ వాళ్ళ పిల్లని ఇంటికి తీసుకొని వచ్చింది. ముగ్గురు పిల్లలు వాళ్ళ అమ్మ తో పటు నెల మీద కూర్చున్నారు. నేను బతిమి లాడి శివమ్మ ముగ్గురు పిల్లని నాపక్కన కుర్చోపెట్టుకున్నాను. నాలాగా నా పిల్లలు మిగిలిపోవద్దు అని ఎక్కువ శ్రమా చేస్తున్నాను అని చెపింది శివమ్మ. నేను వీళ్లకి ఏదో ఒక సహాయం చెయాలి అనుకున్నాను. మీకు ఏమైనా సహాయం కావాలి అంటే అడగండి అని చెప్పగా శివమ్మ ముగ్గురు పిల్లలు మాకు ఏం వద్దు సార్ అని చెప్పారు. నేను నా భార్య అడగక అడగక మాకు ఒక స్కూటీ తీసియండి సార్ అని అడగరు. మేము ముగ్గురం బస్సులో వేలాలి అంటే డబ్బులు సరిపోవడం లేదు అని స్కూటీ అడిగాము అని చెపింది శివమ్మ పెద్ద కూతురు. మేము బయట లోన్ తీసుకొని వడి కట్టలేము మీకు నెల నెల డబ్బులు ఇస్తాము అని చెపింది. అలాగే నేను స్కూటీ తీసిచ్చాను . నాకు ప్రతి నెల డబ్బులు తెచ్చిచ్చి నేను స్కూటీ కి ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చేశారు. నేను ఒక్క పదివేలు ఉంచుకొండి అని చెపిన తీసుకోలేదు. ఒకసారి శివమ్మ తో ఒక మాట చెప్పాను. ఇంకా రెండు సమస్త్రాలు కష్టం నీకు తరువాత మీ పిల్లలు చూసుకుంటారు. నాకు కోపం లేదుగాని పిల్లలు కి కోపం ఉంది. అయినా పిల్ల లు చదువులు ఐపోయాయి. ఇంకా పిల్లలలు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోతారు. ఆ తరువాత నాకు తోడుగా ఉండేది న భర్తీ కదా సార్. ఇప్పుడు కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందే అని చెపింది. చిన్న చిన్న వాటికీ విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.
నీతి : మనం నడవడానికి శక్తి ని ఇచ్చిన అమ్మ ను మరవకండి. మరియు వదలిపెట్టకండి.

ఇటువంటి వాటిని మరిన్ని చూడడానికి తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment