Home » మొండితల్లి పిల్ల నువ్వు (Mondithalli Pilla Nuvvu) సాంగ్ లిరిక్స్ – Viswam

మొండితల్లి పిల్ల నువ్వు (Mondithalli Pilla Nuvvu) సాంగ్ లిరిక్స్ – Viswam

by Lakshmi Guradasi
0 comments

అమ్మ గుండె బరువే..
చెప్పుకుంది వినవే..
ఊపిరంతా పోగేసి.. రాశా..

తప్పటడుగులలో..
బిక్కుమన్నా వేళలో..
పక్కనుండలేనమ్మా.. బహుసా..
నువ్వెక్కడా అంటూ చూడొద్దు..
నేనచ్చంగా నీలానే ఉంటా..
నా పంచ ప్రాణాల బొమ్మ మీద..
దిష్టి చుక్క నేనై ఉంటా..

మొండి తల్లి పిల్లా నువ్వు..
నీ అడుగే తడబడితే.. ఇదిగో..
నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి!
కలకో భయపడకే.. ఏపుడూ..
నీ కునుకై ఉంటానులే.. చిన్నారి తల్లి!!
మొండి తల్లి పిల్లా నువ్వు..

చిమ్మచీకటాల్లుకున్నా..
కారుమబ్బు కమ్ముకున్నా..
చందమామనీ ఇంతైనా.. తాకలేవు ఏవీ..
మట్టి మట్టుబెడుతున్నా..
అగ్గి యెండగడుతున్నా..
చిన్ని విత్తనం చేతుల్లో.. ఒడిపోయి తీరాలిలే..

రాకాసి.. సంద్రమంచులో
తేలేటి..నావపై.. జాలి పడదే కెరటం..
భూమిపై.. కాలు మోపినా ఆ చోటా..
మొదలై.. ఆగది పోరాటం..

మొండి తల్లి పిల్లా నువ్వు..
నీ అడుగే తడబడితే.. ఇదిగో..
నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి!
కలకో భయపడకే.. ఏపుడూ..
నీ కునుకై ఉంటానులే.. చిన్నారి తల్లి!!
మొండి తల్లి పిల్లా నువ్వు..

కళ్ల గంత కట్టుకున్నా
చేతులడ్డు పెట్టుకున్నా
కష్టమన్నది కొంతైనా మాయమై పోదే..!
కత్తికెంత పదునున్నా
రాయికెంత బలమున్నా
నీటి ధార నే తెచ్చిన దాఖలాలే లేవులే..!
గాలిలో కేగె ధైర్యమే లేదంటే
రెక్కలే నీకున్నా వ్యర్ధం..!
చివ్వరి శ్వాస చెప్పిన ఈ మాట
గుండెల్లో దాచుకోవే కొంచెం.. !

మొండి తల్లి పిల్లా నువ్వు..
నీ అడుగే తడబడితే.. ఇదిగో..
నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి!
కలకో భయపడకే.. ఏపుడూ..
నీ కునుకై ఉంటానులే.. చిన్నారి తల్లి!!
మొండి తల్లి పిల్లా నువ్వు..


పాట టైటిల్ – మొండితల్లి పిల్ల నువ్వు (Mondithalli Pilla Nuvvu)
చిత్రం : విశ్వం (Viswam)
సంగీతం – చైతన్ భరద్వాజ్ ( Chaitan Bharadwaj)
గాయని – సాహితీ చాగంటి (Sahithi Chaganti)
సాహిత్యం – శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
తారాగణం – గోపీచంద్ (Gopichand), కావ్య థాపర్ (Kavya Thapar),
దర్శకుడు: శ్రీను వైట్ల (Sreenu Vaitla)
ప్రెసెంట్స్ : దోనేపూడి చక్రపాణి (Donepudi Chakrapani)
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి (TG Vishwa Prasad & Venu Donepudi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment