ఒక అడవిలో సింహాం చిరుత పులి కలిసి ఉండేవి. రెండింటికి వయసైపోవడంతో పెద్దగా వేటడలేక పోయేవి ఉన్నదారిట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడి పోయాయి అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈ సారి ఇద్దరం కలిసే చెరో వైపు నుంచీ దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుత పులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలసే వేటాడాం కಲಿసే వేటాడాం కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది. అసలు నీకు వాటనే ఇవ్వను మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత. ఈ గోడమంతా చెట్టు చాటు నుంచి ఓ నక్క గమనించ సాగింది. అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండూ ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్ధం మైంది. గొడవ పడీ పడీ సింహం చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదుననుకున్న నక్క గబాలున జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో కలిసి పంచుకోకుండా గోడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని భాద పడ్డాయి. సింహం చిరుతపులులు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.