Home » సిమ్ కార్డు లేకపోయినా మెసేజ్ లు పంపించవచ్చా…

సిమ్ కార్డు లేకపోయినా మెసేజ్ లు పంపించవచ్చా…

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్! సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే మొబైల్ లో సిమ్ కార్డు ఉండాలి లేదా వైపై కనెక్షన్ అయినా ఉండాలి. మరి కొండ ప్రాంతాలు, అడవులు, సముద్రాలు వంటి సిగ్నల్ రాని ప్రదేశాలకు వెశ్లినప్పుడు పరిస్థితి ఏంటి ఇలాంటి సమయంలో ఇతరులతో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ ప్రశ్నలకు ఎవ్వారి దగ్గరా సమాధానం ఉండదు. అయితే ఈ పరిస్థితులను అధిగమించేందుకే యాపిల్ సంస్థ కొత్త సాంకేతికతకు నాంది పలుకుతోంది.

కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఇలాంటి కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేయడానికి సన్నహాలు చేస్తున్నది. ఈ ఏడాది చివరినాటికి విడుదలయ్యే ఐఓఎస్ 18 వెర్షన్ ఫోన్లలో ఈ ఫిచర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు తెలుపుతున్నాయి. శాటిలైట్ సేవలను వినియోగించుకొని ఎమర్జెన్సీ మెసేజ్లు పంపేలా ఈ సాంకేతికతను డెవలప్ చేస్తున్నారు. 2022 తర్వాత మార్కెట్ లోకి వచ్చిన అన్ని ఐఫోన్ లలోనూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని . ఇప్పటికే దీనికి సంబంధించిన హర్డ్ వేర్, సాఫ్ట్ వేర్, అల్గారిధమ్ లు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ని సందర్శించండి.

You may also like

Leave a Comment