మెల్లగా తెల్లారిందో ఎలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గల గల
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచులో
చుట్టాల పిలుపులో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించు
అందించు హృదయం
చలిమంటలు ఆరేలా
గుడి గంటలు మోగేలా
సుబ్రభాతలే వినవెలా..
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళ
స్వాగతాలవిగో కానవెలా..
పొలమారె పొలమంతా
ఎన్నాళ్ళో నువ్వు తలచి
కళ మారే ఊరంతా
ఎన్నేళ్ళో నువ్వు విడచి
మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన
పసి తనమే గురుతొస్తుందా
ఇంతకన్నా.. తీయనైన జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన
నువ్వూగిన ఊయల ఒంటరిగా ఊగాల
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల
నన్నెవరూ వెతికే వీల్లేకా
కన్నులకే తీయదనం
రుచ్చి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయేళ్ళే
పూల చెట్టుకి ఉందొ భాష
అలల మెట్టుకి ఉందొ భాష
అర్థమవ్వని వాళ్లే లేరే
అందం మాటాడే భాష
పలకరింపే పులకరింపై
పిలుపునిస్తే పరవసించడమే
మనసుకి తెలిసిన భాష
మమతలు పంచె ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కాదనేవాళ్లే లేరేవరు
__________________
పాట: మెల్లగా తెల్లరిందోయ్ (Mellaga Tellarindoi)
సినిమా పేరు: శతమానం భవతి (Shatamanam Bhavati)
నిర్మాత: దిల్ రాజు (Dil Raju)
దర్శకుడు: వేగేశ్న సతీష్ (Vegesna Satish)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
నటుడు: శర్వానంద్ (Sharwanand)
నటి : అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), రమ్య బెహరా (Ramya Behara), మోహన భోగరాజు (Mohana Bhogaraju)
సాహిత్యం: శ్రీమణి (Srimani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.