గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే
విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే
పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే
బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే
నీ గుండెలో ఉందామని
నీ మాటలే విందామని
వెంటే పడి వచ్చానులే
నీతో ఉండిపోదామని
ఓ ఓ నువ్వే కావాలే నువ్వే కావాలే
నువ్వు నీ నవ్వు నాకే కావాలే
ఇంకో జన్మైనా నువ్వే కావాలే
ఇంతే నాకింతే కావాలే
గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే
విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే
పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే
బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే
నువ్వు కోపగిస్తే ఎండ
మాట మంచుకొండ
నవ్వు పులా వర్షాలే..
అందుకేగా బుజ్జి కొండ
చిన్ని గుండె నిండ
నిన్ను నింపుకున్నాలే..
ఓఓ వద్దే నన్నొదిలి
ఓఓ వద్దే చెయ్యోదిలి
ఓఓ వద్దే ఓ జాబిలి
నీ వెన్నెలంతా నాపై జల్లి
నిన్నే చూస్తూనే ప్రేమే పుట్టిందే
నీతో నా ప్రాణం జంటై కట్టిందే
పిల్ల ఈ గాలి నన్నే చుట్టిందే
వేరే లోకంలో నెట్టిందే
ఈ ప్రేమ దారిలో ఎనెన్ని మాయలో
దాగుండి చాటుగా ఉంటాయిలే
నాకు ఆ సంగతి నీతోటి ప్రేమలో
పడ్డాకే పూర్తిగా తెలిసిందిలే
మైవలపు చూసాను నీ చూపులో
మాములుగా లేదు నా మనసులో
వందేళ్ల పాటింకా ఈ హాయిలో
దాచేసుకుంటా నిన్ను నాలో
గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావే
విచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే
పిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావే
బుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే
నీ గుండెలో ఉందామని
నీ మాటలే విందామని
వెంటే పడి వచ్చానులే
నీతో ఉండిపోదామని
ఓఓనువ్వే కావాలే నువ్వే కావాలే
నువ్వు నీ నవ్వు నాకే కావాలే
ఇంకో జన్మైనా నువ్వే కావాలే
ఇంతే నాకేం కావాలి
__________________
సాంగ్ /ఆల్బమ్ : నువ్వే కావాలి (Nuvve Kavali)
నటీనటులు: మెహబూబ్ దిల్సే (Mehaboob Dilse) & శ్రీ సత్య (Sri Satya)
దర్శకత్వం-డాప్-ఎడిటింగ్: భార్గవ్ రావాడ (Bhargav Ravada)
క్రియేటివ్ ఎగ్జిక్యూషన్ & కొరియోగ్రఫీ: మెహబూబ్ దిల్ సే (Mehaboob Dil se)
సంగీతం & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: మనీష్ కుమార్ (Manish Kumar)
లిరిక్స్ : సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
గాయకులు: మనీష్ కుమార్ & విషు మాయ (Manish Kumar & Vyshu Maya)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.