Home » మాటనేది లేదు భాషనేది లేదు సాంగ్ లిరిక్స్ 1947 A Love Story

మాటనేది లేదు భాషనేది లేదు సాంగ్ లిరిక్స్ 1947 A Love Story

by Lakshmi Guradasi
0 comments
Matanedi ledu bashanedi ledu song lyrics 1947 A Love Story

తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే

పూలు పూయు తరుణం
లోకంలో ఎవరు చూడలేదే
ప్రేమ పొంగు సమయం
హృదయంలో ఎవరు పోల్చలేదే

నిన్న మరి ఘడియ సాగలేదే
నీ ఒడిలో యుగము చాలలేదే
పెదవి కదలలేదే నీ జతలో
కదల తలుపు లేదే, ఇది ఏంటో
రేయి గడవలేదే, గడిచాక
పగలు ముగియలేదే పావురమా…. ఆ

తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం తతన తానానె తననే

మాటనేది లేదు… భాషనేది లేదు
చూపు భాష నాకు చాలులే
నిన్ననేది లేదు… రేపనేది లేదు
నేటి రోజు నాకు చాలులే

నారన్నదే లేదు… నీరన్నదే లేదు
నాలోన విరితోట విరబూసెనే
ఏ కత్తి పిడి లేదు… ఏ రక్త తడి లేదు
నును మెత్తని ప్రేమ నను గెలిచెనే

కలిసిపోయే మనసు
తొలిసారి నిలిచిపోయే అడుగు
నిను చేరి నిలిచిపోయే మనసు
ప్రతిసారి కలిసి వేయి అడుగు పావురమా…… ఆ

ఏమి మేఘమిది ఎదుట కురిసి
ఎద ఏరువాకలుగా మార్చెనే
ఏమి బంధమిది ఎపుడు ఎరగనిది
ఏడు సంద్రములు దాటెనే

ఏ ఊరో నాకేంటి… ఏం పేరో నాకేంటి
ఎనలేని అనుబంధం పెరిగిందిలే
మైదానమైతేంటి శిఖరాగ్రమైతేంటి
మది నేడు తన నుండి కదలిందిలే

పలుకు ఆగుతున్న
ప్రాణంతో పాట ఆగలేదే
ప్రియ లయలో నడక ఆగుతున్న
జీవంలో నాట్యమాగలేదే, ఇది ఏంటో..

తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే

పూలు పూయు తరుణం
లోకంలో ఎవరు చూడలేదే
ప్రేమ పొంగు సమయం
హృదయంలో ఎవరు పోల్చలేదే

నిన్న మరి ఘడియ సాగలేదే
నీ ఒడిలో యుగము చాలలేదే
పెదవి కదలలేదే నీ జతలో
కదల తలుపు లేదే, ఇది ఏంటో…..
రేయి గడవలేదే, గడిచాక
పగలు ముగియలేదే పావురమా…… ఆ

తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.

error: Content is protected !!