మాయ చేసినావే మంత్రం వేసినావే
మత్తే జల్లినావే (మత్తే జల్లినావే)
ఒక్క చూపు తోటి గుండెల్లల్లా పెద్ద
ఉప్పెన తెచ్చినావే (ఉప్పెన తెచ్చినావే)
మాయ చేసినావే మంత్రం వేసినావే
మత్తే జల్లినావే
ఒక్క చూపు తోటి గుండెల్లల్లా పెద్ద
ఉప్పెన తెచ్చినావే
సుక్కలన్నీ పోగేసినావే రెండు కళ్ళల్లో దాచేసినావే
చిన్ని నవ్వే ఇసిరేసినావే
నా జిందగీ మొత్తం నువ్వైపోయావే
మస్తు ముద్దుగున్నవే చిట్టి
ఎత్తికెళ్లిపోతా తాళి కట్టి
మనసు దోచుకున్నవే పొట్టి
గుండెల దాచుకుంటా గూడు కట్టి
నా చెయ్యి నీ చేతినందుకోవాలని ఆరాటపడుతున్నదే
చేతి గీతలన్నీ చెరిపేసి నీ పేరు రాయబుద్దైతున్నదే
కళ్ళు ముసుకుంటే కలలే రావే పిల్ల నీ రూపం ఔపడతదే
చూడకుంటే నిన్ను బతుకు మీద ఆగమైపోతున్నదే
హే లాగేస్తున్నదే ప్రాణం లాగేస్తున్నదే
నువ్వున్న దిక్కును ఎత్తుకుతున్ననే గుంజుకపోతున్నదే
మోగేస్తున్నదే గుండె మోగేస్తున్నదే
నువ్వు కంట పడితే చాలు సన్నాయి రాగాలు పాడేస్తున్ననే
మస్తు ముద్దుగున్నవే చిట్టి
ఎత్తికెళ్లిపోతా తాళి కట్టి
మనసు దోచుకున్నవే పొట్టి
గుండెల దాచుకుంటా గూడు కట్టి
నా నీడ నాతోనే కోట్లాడి
నీ వైపే పరుగులు పెడుతున్నదే
ఈ పిచ్చి మనసేమో మబ్బుల్లో
కవితల్ని రాస్తున్నదే
నా చెంత నువ్వుంటే కొత్తగానే మల్లి పుట్టినట్టుగున్నదే
నువ్వు దూరమైతే లోకమంతా సిమ్మ చీకటైపోతున్నదే
హే పంచేస్తున్నదే ప్రేమని పెంచేస్తున్నదే
కన్న తల్లి లేక్క నన్ను చంటి పోరగాడ్ని చేస్తున్నదే
వచ్చేస్తున్నదే పండగ తెచ్చేస్తున్నదే
పిల్ల పక్కనుంటే సంతోషమంతా చుట్టుముట్టేస్తున్నదే
మస్తు ముద్దుగున్నవే చిట్టి
ఎత్తికెళ్లిపోతా తాళి కట్టి
మనసు దోచుకున్నవే పొట్టి
గుండెల దాచుకుంటా గూడు కట్టి
______________
నటీనటులు: సుభాష్ (Subhash) & శ్వేత (Swetha)
లిరిక్స్ : సాయికృష్ణ వేముల (Sai krishna Vemula)
గాయకుడు: రాము రాథోడ్ (Ramu Rathod)
సంగీతం: హనీ గణేష్ (Honey Ganesh)
కొరియాగ్రఫీ & దర్శకత్వం : సత్య మేకల (Sathya mekala)
నిర్మాత: రాథోడ్ బంకత్లాల్ (Rothad bankatlal)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.