మరి అంత కోపం కానే కాదు అలంకారం
నిజము అబద్ధం అయినదంటే బతుకు శున్యం
అందర్నీ కంది కాలమే అమ్మల్లే తాను సాక్ష్యమే
అహం ఉన్న దేహం దాటలేదు అంధకారం
వేదంతమేమి లేదురా నీలోని నిన్నే అడగరా
చదివే ఓ పాఠము గతము గుణపాఠము
మొదలేంటో తుదలు ఏంటో తెలుపు ఓ ప్రతిబింబమేగా
సుమతి ఆ వేమన తెలిపే ఆలోచనే సరిగా అడుగేయలేవా
నడకే మానేసి రవి నడినెత్తిన ఉంటే తిరిగే
భూగోళం ఒక పెనుజ్వాలే కాదా
సంద్రం తన వేగంతో తీరం దాటిందో
ఓ యుగమే అంతమయ్యే సమయం అది కాదా
బదులే తే గలమా మరి ప్రళయం ఓ ప్రశ్నయిందో…
నేననే బలుపుతో ఎదిగిన ప్రతి వాడు
గెలిచిన ఒంటరే మరి బతుకు చివరన
మత్తనే మందునే మరిగిన ప్రతి ఒక్కడు
మృగముగా మిగిలిన ఒక బానిసే కదా
గాయాలు కాలేని దేహాలు ఉండగలవా
మిగిలే గురుతే నిజం చూపదా
దూరాలు పెంచేసి ప్రేమల్ని చూడగలమా
కోపాలనే కడిగేయాలి కన్నీళ్లతో
నడకే మానేసి రవి నడినెత్తిన ఉంటే తిరిగే
భూగోళం ఒక పెనుజ్వాలే కాదా
సంద్రం తన వేగంతో తీరం దాటిందో
ఓ యుగమే అంతమయ్యే సమయం అది కాదా
బదులే తే గలమా మరి ప్రళయం ఓ ప్రశ్నయిందో…
__________________________
సాంగ్ : మరి అంత కోపం (Mari Antha Kopam)
చిత్రం: బచ్చల మల్లి (Bachhala Malli)
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar)
గాయకుడు: సాయి విఘ్నేష్ (Sai Vignesh)
సాహిత్యం: పూర్ణా చారి (Poorna Chary)
తారాగణం: అల్లరి నరేష్ (Allari Naresh), అమృత అయ్యర్ (Amritha Aiyer)
దర్శకత్వం: సుబ్బు మంగాదేవి (Subbu Mangadevi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.