మరిచిపోయావా మారిపోయావా
తననే వదిలేసి వెళ్లిపోయావా
మరిచిపోయావా మారిపోయావా
తననే వదిలేసి వెళ్లిపోయావా
ఈ జన్మకు తన గుండెలో నువ్వుండి పోతావే
నిన్ను మరిచి ఉండాలంటే ప్రాణాలే పోతున్నాయే
నమ్మి ప్రేమించినందుకానే గొంతు కోసి వెళ్ళిపోతివే
మరిచిపోయావే మారిపోయావే నన్నిలా వదిలేసి వెళ్లిపోయావే
మూడు ముళ్ళు వేయమంటివే ఏడు అడుగులు వేస్తానంటివే
నా ప్రాణం నీ సొంతం అంటివే…
నా కళ్ళలో నీ రూపమే కలగానే మిగిలిందిలే
నా కన్నీటిలో నీ మౌనమే దాగుండి పోయిందిలే
నాకోసమే పుట్టావని కలలెన్నో కన్ననే
ఈ జన్మలో నీ ప్రేమకు నేను దాసున్ను అయ్యానే
ఎంతగా ఇష్టపడ్డానే… గుండెకే గాయం చేస్తివే
నా గుండెకే గాయం చేస్తివే..
మరిచిపోయావే మారిపోయావే
నన్నిలా వదిలేసి వెళ్లిపోయావే
ఏ వైపు చూసిన నువ్వే
ఎటు వైపు వెళ్లిన నువ్వే
కళ్ళముందు ఉన్నట్టున్నవే…
నువ్వు గుర్తుకొస్తే గుండెలోన బాధనిపిస్తున్నదే
నా కళ్ళలోన కన్నీళ్లే ఆగను అంటున్నదే
ఏ దేవుడు రాసాడో ఈ రాత మనకు
ఈ జన్మలో నిన్ను నన్ను దూరం చేసాడే
ఎడారిలో నన్ను తోసేసి… ఒంటరిని చేసి పోతివే
నన్నే ఒంటరిని చేసి పోతివే
మరిచిపోయావే మారిపోయావే
నన్నిలా వదిలేసి వెళ్లిపోయావే
పచ్చని పందిట్ల నువ్వే
పాదాలకు పారాణి పూసి
నవ్వుకుంటూ నువ్వే ఉన్నవే…
నిన్ను చూడలేక నా ప్రాణమే విల విల లాడిందే
నా మనసుకే గాయం చేసి మౌనంగా నువ్వుంటివే
ఇన్నాళ్ల మన ప్రేమ ఏమైపోయిందే
ఇంతలోనే నువ్వే నన్ను దూరం చేసావే
నీకే దూరమైపోతున్నానే… రాణిలాగా నువ్వుండాలని
నా రాణిలాగా నువ్వు బ్రతకాలని
మరిచిపోయావే మారిపోయావే
నన్నిలా వదిలేసి వెళ్లిపోయావే.. ఆ..
Song Credits:
నిర్మాత: మహేశ్ జనారపు
సాహిత్యం: లక్కమల్ల రవి
సంగీతం: ఇంద్రజిత్
దర్శకులు: శ్రీకాంత్ పోతరాజు, రాకేష్ చందా
గాయకుడు: దిలీప్ దేవగన్
డోప్&ఎడిటింగ్: అరుణ్ కొలుగూరి
తారాగణం: రవళి, జయారపు సందీప్, హరి దేవరకొండ
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.