కావలసిన పదార్థాలు:
- మరమరలు – రెండు కప్పులు.
- బొంబాయి రవ్వ – అర కప్పు.
- పెరుగు – అర కప్పు.
- శనగ పిండి – రెండు టేబుల్ స్పూన్లు.
- గోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లు.
- ఉప్పు – తగినంత.
- వంట సోడా – పావు స్పూన్.
- నూనె – పావు కప్పు.
- ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు.
- కొత్తిమీర తరుగు – పావు స్పూన్.
- క్యాప్సికం తరుగు – పావు కప్పు.
- నిమ్మకాయ – సగం.
- పెరుగు – అర కప్పు.
- నీళ్లు – తగినంత.
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోని పక్కన పెట్టుకోవాలి మరియు కొత్తిమీర, క్యాప్సికం ను తురుములా చేసుకోవాలి. ఆ తరువాత మరమరాలను ఒక గిన్నెలో వేసుకుని ఎక్కువ నీళ్లలో పోసుకోవాలి. పావు గంట అయ్యాక మరమరాలను గట్టిగ పిండిలా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో బొంబాయి రవ్వ, శనగ పిండి, గోధుమ పిండి, ఉప్పు, పెరుగు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో బొంబాయి రవ్వ మిశ్రమం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకోని వంట సోడా వేసి, నిమ్మరసం పిండి కలిపి మూత పెట్టాలి 20 నిముషాలు తరువాత స్టవ్ ఆన్ చేసుకుని పెనుము పెట్టి ఈ పిండిని దోసలో పరిచి కొద్దీకొద్దీగ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, క్యాప్సికం ముక్కలు చల్లి నూనెలో ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని వేసుకోవాలి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.