Home » ఈ పండ్లలోనే కాదు వాటి తొక్కల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి

ఈ పండ్లలోనే కాదు వాటి తొక్కల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి

by Shalini D
0 comment

నిమ్మ కాయలు, నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఈ పండ్లలోనే కాదు వాటి తొక్కల్లో కూడా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. ఈ పండ్లలో, తొక్కల్లో విటమిన్ సి నిండి ఉంటుంది. కాబట్టి పండ్లను తినేశాక తొక్కలను పడేయకుండా వాటిని తిరిగి ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా వాటి తొక్కలను భద్రపరిచి వాటితో క్లినింగ్ లిక్విడ్ తయారు చేయాలి.

దీని కోసం తొక్కలను ఒక గిన్నెలో వేసి, అందులో నీళ్లు వేసి మరిగించండి. ఆ ద్రవాన్ని చల్లబరిచి స్ప్రే బాటిల్‌లో వేసి అవసరం అయినప్పుడు వాడుకోవాలి. ఆ క్లినంగ్ లిక్విడ్ తో ఇంట్లో పడిన అనేక రకాల మరకలను పొగొట్టుకోవచ్చు. నారింజ లేదా నిమ్మ తొక్కలను నీటిలో మరిగించడం ద్వారా, ఈ నీటితో పాత్రల పసుపు రంగును తొలగించవచ్చు. అలాగే వీటితో తయారు చేసిన లిక్విడ్‌తో మురికిగా ఉన్న స్టీల్ కొళాయిలను శుభ్రపరచవచ్చు.

ఆ తొక్కలలో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, కాబట్టి మొండి మరకలను ఇవి త్వరగా తొలగిస్తాయి. రెండు గ్లాసుల నీటిలో నారింజ, నిమ్మ తొక్కలు వేసి నానబెట్టి గిన్నెలను తోమి చూడండి. అవి తళతళ మెరుస్తాయి. అలాగే నిమ్మ తొక్కలు, నారింజ తొక్కతో చేసిన ఆ నీటిలో కొన్ని చుక్కల డిష్ వాషర్ కూడా కలపాలి. ఇప్పుడు ఈ నీటితో పాత్రలు, స్టీల్ కుళాయిలను శుభ్రం చేసుకోవాలి.

నారింజ, నిమ్మ తొక్కలను నీటిలో మరిగించి సింక్‌లను శుభ్రం చేయడానికి, బేసిన్లను కడగడానికి ఉపయోగించవచ్చు. శుభ్రం చేయడానికి నారింజ, నిమ్మ తొక్కలను నీటిలో మరిగించి అందులో నిమ్మరసం కలపాలి. నీరు మరిగిన తర్వాత సింక్2ను శుభ్రం చేసి ఈ నీటితో బేసిన్‌ను కడగాలి. దీంతో సింక్, బేసిన్ సరికొత్తగా కనిపిస్తాయి.

ఆరెంజ్, నిమ్మ తొక్కలతో చేసిన క్లినింగ్ లిక్విడ్ బాత్రూమ్ క్లీనర్లుగా కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం తొక్కలను నీటిలో వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, ఒక టీస్పూన్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు తయారుచేసిన మిశ్రమాన్ని బాత్రూమ్ టైల్స్ పై ఉంచి బ్రష్ తో రుద్దాలి. ఇలా చేయడం వల్ల బాత్రూంలోని పసుపు రంగు పూర్తిగా తొలగిపోయి టైల్స్ పూర్తిగా మెరుస్తాయి.

రూమ్ ఫ్రెషనర్ తయారీ ఇలా: నారింజ, నిమ్మ తొక్కల సహాయంతో ఇంట్లోనే మంచి రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని నిమ్మ, నారింజ తొక్కలను ఒక గ్లాసు నీటిలో వేసి తేలికపాటి మంటపై మరిగించాలి. దీనికి కొద్దిగా దాల్చిన చెక్క కూడా కలుపుకోవచ్చు. దీన్ని మంట మీద ఉడికించిన వెంటనే మీ ఇల్లంతా ఎంతో ఆహ్లాదకరమైన సువాసనతో, పరిమళభరితంగా ఉంటుంది. నీరు సగానికి తగ్గిన తర్వాత వేడిని ఆఫ్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ ద్రవాన్ని ఇంట్లో స్ప్రే చేయవచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment