మన్మధుడా నీ కల కన్నా
మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా
మన్మధుడే నా కావలేగా
నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియకా
నిన్ను కన్న తొలి నాడే దేహం కదలకా
ఉహలలో అనురాగం ఊపిరి వలపేలే
ఎందరినో నే చూసా గాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగా ఎపుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు
ఎందరినో నే చూసా గాని ఒకడే మన్మధుడు
ఇరవై ఏళ్ళుగా ఎపుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు
మన్మధుడా నీ కల కన్నా
మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా
మన్మధుడే నా కావలేగా
మగువగా పుట్టినా జన్మ ఫలితమీనాడు తెలిసే
మత్తుగా మెత్తగా మనసు గెలిచి నా తోడూ కలిసే
ఎదల లోన ఊయలలూగే అందగాడు ఇతడంటా
ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంటా
ఐన నేను మారలే అందంగా బదులిస్తాలే
సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా
ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే ఐతే ఇది ఏం చరిత్రమో
ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు ప్రియుడే ఐతే ఇది ఏం చరిత్రమో
మన్మధుడే నా ప్రాయముగా
మన్మధుడే నా ప్రాణముగా
మన్మధుడే నా ప్రణయమని
మన్మధుడే నా కిష్టమని
చుక్కపోద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో
ఒక్క నీ ముందు మాత్రం సిగ్గులె మరువనా
నా పడకటింటికి నీ పేరే పెట్టనా
అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొర
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా
ఆ.. ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా
_________________________
పాట: మన్మధుడా నీ కలకన్నా (Manmadhuda Nee Kalaganna)
చిత్రం: మన్మధ (Manmadha)
గాయని: చిత్ర (Chitra)
సాహిత్యం: వేటూరి (Veturi)
సంగీతం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.