మంజుల నీ మీద నాకు మనసాయనే సాంగ్ లిరిక్స్ – Folk 

by Lakshmi Guradasi

మంజుల నీ మీద నాకు మనసాయనే

ఓయ్ మంజుల
మూసి మూసి నవ్వులు ముత్యాలు రాలంగా
ముద్దుగుమ్మ నిన్ను చూసి మురిసిపోతి
మంజుల నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతిని

కొండ కొనలలో వాగు వంకలలో
చేను చిలకలలో చిలక వాలిపోయినట్టు
మంజుల నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే

కొండమల్లెలన్ని కొప్పున పెట్టంగా
కోరుకున్నాను నా చెంత చేరంగా
మల్లేశ నీ మీద నాకు మనసాయెరా
మదిలోన నన్ను వీడిపోని నీడైతివి

చెరువు గుంటలలో మోట బావులలో
నేను సేదుకొని తాగే నీరువైతివిరా
మల్లేశ నీ మీద నాకు మనసాయెరా
మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా

పిల్ల పచ్చని చెట్లల్లా పాటలు పాడంగా
పల్లె కోకిలవై గానాలు పలకంగా

పిల్ల పచ్చని చెట్లల్లా పాటలు పాడంగా
పల్లె కోకిలవై గానాలు పలకంగా
అంత ఇంత కాదు చెంత చేరిపోవే
కాంత నీ కోసం కళ్ళు వెతకసాగే
మంజుల నీ మీద నాకు మనసాయెనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే

పావురాల జంట మన జంట మల్లె మల్లేశ
పచ్చంగా నీతోటి వేయి జన్మలుంటా

పావురాల జంట మన జంట మల్లె మల్లేశ
పచ్చంగా నీతోటి వేయి జన్మలుంటా
గుండె మీద నువ్వు గురుతై ఉన్నావు
గువ్వల్ల జంటోలే నన్ను చేరుకోరా
మల్లేశ నీ మీద నాకు మనసాయెరా
మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా

అబ్బా హత్తుకుని నీతో మెత్తంగా ఉంటానే
మత్తు జల్లి మరి నిన్ను ఏలుకుంటానే

పిల్ల హత్తుకుని నీతో మెత్తంగా ఉంటానే
మత్తు జల్లి మరి నిన్ను ఏలుకుంటానే
కన్నె సోకులన్నీ దోచుకుంటానే
కమ్మని కౌగిల్లో నిన్ను దాచుకుంటానే
మంజుల నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే

సుక్కల్లో చంద్రుడా మల్లేశ బావయ్య
సక్కంగా నీవచ్చి సయ్యాటలాడంగా

సుక్కల్లో చంద్రుడా మల్లేశ బావయ్య
సక్కంగా నీవచ్చి సయ్యాటలాడంగా
చూపు సల్లంగుండా నా మీద వాలింది
సూదులోలే దిగి మైమరిపించేలా
మల్లేశ నీ మీద నాకు మనసాయెరా
మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా

చేతికి వచ్చిన పండు చెయ్యికి అందంగా
కోసుకోని పిల్ల కడుపార తింటానే

ఆహా చేతికి వచ్చిన పండు చెయ్యికి అందంగా
కోసుకోని పిల్ల కడుపార తింటానే
కోకిలమ్మలాగా కూతకొచ్చిన పిల్ల
కోరి మరి పిల్ల నిన్ను చేరుకుంటా
మంజుల నీ మీద నాకు మనసాయనే
మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే

ముత్యాల పందిట్లో మూడు ముళ్ళు వేసి
ముతైదులందరూ దీవించుతుండంగా

ముత్యాల పందిట్లో మూడు ముళ్ళు వేసి
ముతైదులందరూ దీవించుతుండంగా
సిగ్గుపడితే బావ అక్షింతలేయంగా
పక్కాలు నాకేసి పట్టుకోరా బావ
మల్లేశ నీ మీద నాకు మనసాయెరా
మదిలోన నన్ను వీడిపోని నీడైతివిరా

మంజుల నీ మీద నాకు మనసాయనే

__________________________

లిరిక్స్ & ట్యూన్: చీకోడు నర్సింలు (CHIKODU NARSIMLU)
గాయకులు : బొడ్డు దిలీప్ (BODDU DILIP) – లావణ్య (LAVANYA)
సంగీతం: వెంకట్ అజ్మీరా (VENKAT AZMERA)
నటులు : పార్వతి మహేష్ (PARVATHI MAHESH), యమున తారక్ (YAMUNA TARAK)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like