వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు…
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు…
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు..
వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు…
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు..
చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు..
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు..
హార్ జాయే సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే.
జాయే ఓ సబ్ కో… ఖాబొంకే ఘర్ పర్
ఉస్కీ ఆంఖే జా మక్తి… చింగారి జైసేబా
తోమ్మే బిజిలి చూటా దిల్ పే సే..
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే…
నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు..
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే…
వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు..
అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్…
ఏ దునియాలో దొరకదే ఆ బాడీ మ్యాప్
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు..
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు..
వేగంగా నా వైపే దూసుకు వచ్చి…
నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే…
నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ..
దారులు చూపించు వాడి చూపుడు వేలు…
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు..
ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు..
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు..
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు..
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండు..
_____________________
పాట పేరు: బుల్లెట్ సాంగ్ (Bullet Song)
గాయకుడు: మంగ్లీ (Mangli)
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ (Mittapally Surendar)
సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి (Suresh Bobbili)
తారాగణం: సందీప్ మాధవ్ (Sandeep Madhav), అభయ్ బేతిగంటి (Abhay Bethiganti), సత్యదేవ్ (Satyadev), శత్రు (Shatru), మనోజ్ నందం (Manoj Nandam), ముస్కాన్ ఖుబ్‌చందానీ (Muskaan Khubchandani)
దర్శకుడు: జీవన్ రెడ్డి (Jeevan Reddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.