ప్రేమనంతా గుండెలో దాస్తే గాయమే మిగిలేనా
ఆయుమంతా నీకనే దాస్తే అలుసునైపోతిగా
మనసు లేని మనిషి కై నీ కళ్ళల్లో బాధేనా
తలచుకొని తనివితీరా నువ్వు ఏడ్చినా తీరునా
అలసిపోతేనే అందలేనులే
మళ్ళి కోరినా తిరిగి రానులే
ఓ మనసులో పెంచిన గాని
తెంచుకుంది వెరోనికై
ఆ బంధమే ఏమిటో తెలియదు గాని
బదునామె చేసింది వాడికై
మనసు లేని బొమ్మవే నువ్వు
మురిసిపోయి ఉంటావులే
తలుసుకున్న ప్రతి గడియలోను
కన్నీళ్లే మిగిలినాయే
మనసు లేని బొమ్మవే నువ్వు
మురిసిపోయి ఉంటావులే
తలుసుకున్న ప్రతి గడియలోను
కన్నీళ్లే మిగిలినాయే
ఓ కానలేవా నీలి కన్నుల
నన్ను కోరుకున్న ఓ కోయిల
ఎదురు వచ్చే ఏదో నీడల
నా ఎడబాసిపోయిందే నన్నిలా
నన్నే మరిసిపోతే వాని మాయల
మనసే సచ్చిపోయే దిక్కు లేదనా
నే చెప్పలేనే నా వేదన
చెర ఒక్కసారి రాయే ఎన్నెల
నీ స్నేహమే అనుకున్నా గాని
ఊహించలే నీతో వేరోన్ని
నా ప్రేమే సరిపోలేదాని
చెప్పి ఉంటె బాగుండే చిన్నారి
నీ స్నేహమే అనుకున్నా గాని
ఊహించలే నీతో వేరోన్ని
నా ప్రేమే సరిపోలేదాని
చెప్పి ఉంటె బాగుండే చిన్నారి
బొమ్మలాట అయ్యే బతుకు
మనసుతోని ఆటలాడి ఒక్కసారి అనిపించలేదా
నీ బందీనై పోతానని
(నీ బందీనై పోతానని)
ఓ కానలేవా నీలి కన్నుల
నన్ను కోరుకున్న ఓ కోయిల
ఎదురు వచ్చే ఏదో నీడల
నా ఎడబాసిపోయిందే నన్నిలా
నన్నే మరిసిపోతే వాని మాయల
మనసే సచ్చిపోయే దిక్కు లేదనా
నే చెప్పలేనే నా వేదన
చెర ఒక్కసారి రాయే ఎన్నెల
మురిసిపోతినే నిన్ను చూసుకొని
అందరమ్మాయోలే నువ్వు కాదు అని
తెలిసిపోయిందిలే పిల్ల నేడు
తెంచే ముసుగులోనే నువ్వు మునిగవని
మురిసిపోతినే నిన్ను చూసుకొని
అందరమ్మాయోలే నువ్వు కాదు అని
తెలిసిపోయిందిలే పిల్ల నేడు
తెంచే ముసుగులోనే నువ్వు మునిగవని
కోరినవే కొన్నాళ్లే నన్ను కోట్లు ఏమి లెవా అని
విడిసిపోతావానే నన్ను కొత్తగోచ్చే బంధానికై
కొత్తగోచ్చే బంధానికై
ఓ స్నేహమన్న ఒక్క మాటలా
చెదిరిపోయే నిండు నూరేళ్ళ కల
ప్రేమంటే ఏమిటే ఈ రోజులా
పెంచుకున్న కొద్ది ముంచేదేగా
నా కళ్ళ ముందే ఇంకోడితో
కలిసిపోతానంటే నేనుంటనా
ఆ రోజే వచ్చే నా బతుకుల
ఇంకా బరువు పెంచిపోతున్నావా
________________________
లిరిక్స్ & కో ప్రొడ్యూసర్: దివ్య భోనగిరి
గాయకుడు: అజయ్ మెంగాని
దర్శకత్వం: AJ ప్రసాద్
సంగీతం: హనీ గణేష్
నిర్మాత: సోమి కర్ణాకర్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.