ఉంటావా నీతోడుంటావని
నిన్ను నమ్ముకుని వచ్చినోడినమ్మా
కంటతడి పారాణి జెసి
నీ కాళి కింది పడివుంటినమ్మా
నీకు దగ్గరయ్యేటి లోగా
నిండా ముంచి పోతివేంటమ్మా
నిమిషమైన ఉండలేనోన్ని
నిన్ను జూడక ఎట్టుందునమ్మ
పాణమని చెప్పుకుంటివే
నూరేళ్లు ఉంటానంటివే
అమ్మ అయ్యాను ఇడిసి వస్తివే
నింద మోపి ఎట్ట పోతివే
మనసేట్టా వచ్చినదే
చావు దెబ్బ నన్ను కొట్టి పొయ్యేటట్టు
మనిసెట్ల పోయినవే
నాతో చివరి దాకా ఉంటనేసినట్టు
మనసేట్టా వచ్చినదే
చావు దెబ్బ నన్ను కొట్టి పొయ్యేటట్టు
మనిసెట్ల పోయినవే
నాతో చివరి దాకా ఉంటనేసినట్టు
నా తోడు లేకపోతే
ఉరిపోసుకుంటానంటివి గాదనే
నేను రాకపోతే సచ్చిన
సవమైతానంటివి గాదనే
నచ్చనోడికిచ్చి కట్ట బెడతారని
ఏడ్చిన రోజులు ఏమాయెనే
నిన్ను చంపిన నచ్చని పెళ్లిచేసుకోను
అన్న పలుకులు ఇప్పుడు ఎటుపోయెనే
గంజి బువ్వ తిన్న నాతోనే
బతుకన్నా మాటలే యాది లెవా
నా గుండె పలుగుతున్న చప్పుడే
చెయ్యని ముగదాని వైతివా
నా బతుకును ఇడిసి పోతివా
మనసేట్టా వచ్చినదే
చావు దెబ్బ నన్ను కొట్టి పొయ్యేటట్టు
మనిసెట్ల పోయినవే
నాతో చివరి దాకా ఉంటనేసినట్టు
మనసేట్టా వచ్చినదే
చావు దెబ్బ నన్ను కొట్టి పొయ్యేటట్టు
మనిసెట్ల పోయినవే
నాతో చివరి దాకా ఉంటనేసినట్టు
నీ వాళ్ళు నిన్ను బయపెట్టిన్నారో
సావు భయము పెట్టిన్నారో
గుణమున్న కులము లేదాని
మాటలెన్ని చెప్పిన్నారో
ఆస్థి పాస్తులే అసలే లేవని
డబ్బున్నోనికి ఇచ్చిన్నారో
అట్లయిన వాని గుణమైన
మంచిదో కాదో అని తెలుసున్నారో లేదో
మేడలుంటే చాలు గొప్పోల్లు అన్న
మాటలెవరు చెప్పిరే
గుడిసెల్లున్నోడికి గుండె లేదని
తీసి పారేసిరే
కులోన్నీ వెక్కిరించి పోతివే
మనసేట్టా వచ్చినదే
చావు దెబ్బ నన్ను కొట్టి పొయ్యేటట్టు
మనిసెట్ల పోయినవే
నాతో చివరి దాకా ఉంటనేసినట్టు
___________________________
లిరిక్స్ – కాసాని నాగరాజ్
సంగీతం – మదీన్ SK
గాయకుడు – హన్మత్ యాదవ్
దర్శకుడు – దేవా పొన్నకంటి
నిర్మాత – పోలుమూరి శ్రీకాంత్ బాబు
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.