Home » మనసే మనసే – దర్శన

మనసే మనసే – దర్శన

by Hari Priya Alluru
0 comments

మనసే మనసే తననే కలిసే

అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా

తనతో నడిచే అడుగే మురిసే

తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా

ఎన్నో ఊసులు ఉన్నాయిలే

గుండే లోతుల్లో

అన్ని పంచేసుకుందామంటే

కళ్ళముందు లేదాయే దర్శన

దర్శన తన దర్శనానికింకా

ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల

గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల

గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే

దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే

నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే

నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే

చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా

అరె లెక్క పెట్టుకుంటే

బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల

గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల

గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

దారులన్ని మూసేసినట్టే

చీకటేసి కప్పేసినట్టే

నువ్వు లేకపోతే

నేను ఉన్నా లేనట్టే

చందమామ రావే రావే

జాబిలమ్మ రావే రావే

కమ్ముకున్న ఈ మేఘాలలో

వెలుతురు కనబడదే

బెంగతో ఇల ఇల

పోయేలా ఉన్నానే పిల్ల

నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా

ముట్టనులే నీమీదొట్టే

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల

గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల

గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment