వినాలి
వీర మల్లు మాట చెప్తే.. వినాలి..
అప్పన్న సుబ్బన్న.. కొట్టు
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి…
ఉత్తది గాదు మాట తత్తరపడక…
చిత్తములోనా చిన్న ఒద్దికుండాలి…
మాట వినాలి గురుడా మాట వినాలి…
మాట వినాలి మంచి మాట వినాలి…
ఈతమాను ఇల్లు గాదు…
తాటిమాను తావుగాదు…
ఈతమాను ఇల్లు గాదు…
తాటిమాను తావుగాదు…
తగిలినోడు మొగుడుగాడు
తగరము బంగారుగాదు… అందుకే…
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి…
ఆకు లేని అడివిలోనా….
అరెరే… మేకలన్నీ మేయవచ్చు…
సద్దు లేని కొనలోనా…
కొండా చారియ కూలవచ్చు…
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతె
మాట దాటి పోతే
మర్మము తెలియకపోతె
పొగరుబోతు తాగురూ పోయి
కొండను తాకినట్టు… అందుకే…
మాట వినాలి గురుడా మాట వినాలి…
మాట వినాలి మంచి మాట వినాలి…
మాట వినాలి గురుడా మాట వినాలి…
మాట వినాలి మంచి మాట వినాలి…
____________________
సాంగ్: మాట వినాలి (Maata Vinaali )
సినిమా: హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu)
గాయకుడు: పవన్ కళ్యాణ్ గారు (Pawan Kalyan)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి (MM Keeravaani)
లిరిక్స్: పెంచల్ దాస్ (Penchal Das),
నటీనటులు : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), అనుపమ్ ఖేర్ (Anupam kher), బాబీ డియోల్ (Bobby Deol), హైపర్ ఆది (Hyper Aadi) మరియు ఇతరులు
దర్శకత్వం : జ్యోతి కృష్ణ (Jyothi Krishna)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.