మారాజయ్యా (Maaraajayya) సాంగ్ లిరిక్స్ | SIR | Dhanush

by Lakshmi Guradasi

మన్నించయ్యా తప్పు మన్నించయ్యా
మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా
వెళ్ళిరాయ్యా సెలవని అంటాంది కంటతడి
ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి
గురు దేవుడిక ఇంతటి శోకం
వెలివేసినదా పాపపు లోకం

మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ
మా రాతలు నీ చేతితో మార్చావయ్యా
ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ
ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా

మోగనన్నదిక బడి గంట నువ్వు లేనిదే
సాగనన్నదే పాఠం నీ జాడ లేనిదే
నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే
నువ్వు గాని వెలుగేదైనా ఉన్నా లేనిదే

నీతో వలస వెళ్లిపోయింది చదువుల వెలుగు
చిమ్మ చీకటి చెరా ముసిరింది అక్షరాలకు
నిప్పులాంటి నీ విలువేం మాసిపోదుగా
నీడలెన్ని ఉన్నా అవి నిజము కావుగా

నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు
అండలేని అనాధలే రాబోయే మా రోజులు
ఆవిరవుతున్నా ఆశలకు దిక్కెవరో

మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ
నువు లేని మాలోటెవ్వరూ తీర్చేరయ్యా
ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ
ఈ మీదట ఏ ధైర్యమై సాగాలయ్యా

In English Version:

Manninchayya thappu manninchayya
Manchollake anni kashtaalayya

Vellirayya selavani antandi kantatadi
Undalekaa nee embade vastandi gunde sadi
Guru devudika intati shokam
Velivesinada paapapu lokam

Maarajayya maarajayya maarajayya o o
Maa raathalu nee chetitho maarchavayya
Ettagayya ettagayya ettagayya o o
Ee daarigaa ee shoonymu daataalayya

Moganannadik badi ganta nuvvu lenide
Saganannade paatham nee jaada lenide
Nuvvu raani tharagathi gadiki oopiraadade
Nuvvu gaani velugedaina unna lenide

Neetho valasa vellipoyindi chaduvula velugu
Chimma cheekati cheraa musirindi aksharalaku
Nippulaanti nee viluvem maasipoduga
Needalanni unna avi nijamu kaavuga

Nuvvu leka chinnaboyee chinnaari chirunavvulu
Andaleni anaadhaley raaboyee maa rojulu
Aaviravuthunna aashalaku dikkevero

Maarajayya maarajayya maarajayya o o
Nuvvu leeni maalotevvaroo teercherayya
Ettagayya ettagayya ettagayya o o
Ee meedata ye dhairyamai saagalayya

______________

Song Credits:

సాంగ్ : మారాజయ్య (Maaraajayya)
చిత్రం: సార్ (SIR)
సాహిత్యం: సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (Saraswati Putra’ Ramajogayya Sastry)
గాయకుడు: కాల భైరవ (Kaala Bhairava)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
రచన & దర్శకత్వం: వెంకీ అట్లూరి (Venky Atluri)
నిర్మాతలు: నాగ వంశీ ఎస్ (Naga Vamsi S) – సాయి సౌజన్య (Sai Soujanya)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like