మా అయ్య అవ్వ కొక్కదాన్నే నన్ను ఒళ్లరో
నన్ను ఒళ్లరో ….
గడప దాటి అడుగు పెట్టని సిగ్గు మొగ్గనిరో
సిగ్గు మొగ్గనిరో ….
మాయ మాటలెన్నొ జెప్పి నాకు మంత్ర మేయకూ
తెల్వకుండ ముగ్గులోకి లాగి నిప్పు వెట్టకూ
సూదు లాంటి సూపు గుచ్చి కైపు పెంచకూ
సంటి దాని ఒంటి నిండ అగ్గి నింపకూ
రేతిరంత కలల వచ్చి వలపు చిచ్చు పె ట్టకూ
కన్నె ఈడు కొంప ముంచ ఎత్తు జిత్తు లేయకూ
మా అయ్య అవ్వ కొక్కదాన్నే నన్ను ఒళ్లరో
గడప దాటి అడుగు పెట్టని సిగ్గు మొగ్గనిరో
మాయ మాటలెన్నొ జెప్పి నాకు మంత్ర మేయకూ
తెల్వకుండ ముగ్గులోకి లాగి నిప్పు వెట్టకూ
ఒహోహూ ఒహోహూ ఒహోహూ అట్టనా అట్టనా
ఆడు ఆడుమాత్రం ఏంజేస్తడు … వాడు వాడో నిప్పు రవ్వగా
వాడి ఈడు ఆత్రం ఏంజేసిన వానితప్పు కానే కాదుగా, కానే కాదుగా
వానితప్పు కానే కాదుగా నీ మీది ప్రేమ గొప్పయేకదా , గొప్పయే కదా
ఎంత జెప్పిన ఇనకుండా ఇంటి ముందు వాల్తడు
ఎంత ఇట్టమున్నఇట్ల అద్దంటే ఇనడుగా ఇనడుగా….
ఇజ్జతంత పోతదన్న నన్నే జూస్త నంటడూ
నువ్వు కాదంటే ఛస్తనని బెదిరిస్తు ఉంటడూ
ఏం పోరడమ్మ వీడు ఏం పోరడూ…..
పొద్దు మాపు కాపు కాసి రచ్చ జేస్తు ఉంటడూ
ఏం పోరడమ్మ వీడు ఏం పోరడూ….
హద్దు దాటి ముద్దులంటు గోల జేస్తు ఉంటడూ
మా అయ్య అవ్వ కొక్కదాన్నే నన్ను ఒళ్లరో
గడప దాటి అడుగు పెట్టని సిగ్గు మొగ్గనిరో
మాయ మాటలెన్నొ జెప్పి నాకు మంత్ర మేయకూ
తెల్వకుండ ముగ్గులోకి లాగి నిప్పు వెట్టకూ
ఒహోహూ ఒహోహూ ఒహోహూ అట్టనా అట్టనా
ఆడు ఆడుమాత్రం ఏంజేస్తడు … వాడు వాడో నిప్పు రవ్వగా
వాడి ఈడు ఆత్రం ఏంజేసిన వానితప్పు కానే కాదుగా, కానే కాదుగా
వానితప్పు కానే కాదుగా నీ మీది ప్రేమ గొప్పయేకదా , గొప్పయే కదా
మల్లె పూలు తెచ్చి పెట్టి జెల్ల వెడతా నంటడూ
మంచ మెక్కి పోరడు మజా జేద్దా మంటడూ అంటడూ….
సెల్లు ఫోను కొని వెట్టి వీడియో కాలు జేస్తడూ
ఒక్కొక్కటి పొగుడుకుంటూ ఎక్కడికో వోతడూ
ఏం పోరడమ్మ వీడు ఏం పోరడూ…..
అడ్డు అదుపు లేకుండా హగ్గు కావాలంటడూ
ఏం పోరడమ్మా వీడు ఏం పోరడూ….
సిగ్గు లేక లెక్కలేని మాటలెన్నో అంటడూ
మా అయ్య అవ్వ కొక్కదాన్నే నన్ను ఒళ్లరో
గడప దాటి అడుగు పెట్టని సిగ్గు మొగ్గనిరో
మాయ మాటలెన్నొ జెప్పి నాకు మంత్ర మేయకూ
తెల్వకుండ ముగ్గులోకి లాగి నిప్పు వెట్టకూ
సూదు లాంటి సూపు గుచ్చి కైపు పెంచకూ
సంటి దాని ఒంటి నిండ అగ్గి నింపకూ
రేతిరంత కలల వచ్చి వలపు చిచ్చు పె ట్టకూ
కన్నె ఈడు కొంప ముంచ ఎత్తు జిత్తు లేయకూ
మా అయ్య అవ్వ కొక్కదాన్నే నన్ను ఒళ్లరో
నన్ను ఒళ్లరో ….
గడప దాటి అడుగు పెట్టని సిగ్గు మొగ్గనిరో
సిగ్గు మొగ్గనిరో ….
మాయ మాటలెన్నొ జెప్పి నాకు మంత్ర మేయకూ
తెల్వకుండ ముగ్గులోకి లాగి నిప్పు వెట్టకూ
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.