ఎహ లేర చంటి…ఎహ లేర చంటి
ఇంకా నిదరేంటి…ఇంకా నిదరేంటి
ఎహ రార బంటి…ఎహ రార బంటి
అట్ట చూస్తావేంటి
తెల్ల తెల్లరగానే పల్లె తుల్లి తుల్లి పడుతుందీ
గున్న మావిల్లతోటీ తోరనాలను కడుతుందీ
పరుగున రారండి పండగ చెయ్యండీ
పరుగున రారండి పండగ చెయ్యండీ
సరదా మొదలందీ సంక్రాంతి
ఎహ లేర చంటి…ఇంక నిదరేంటి
ఎహ రార బంటి…అట్ట చూస్తావేంటి
బందులు ఇబ్బందులూ..పెరిగిన ఖర్చుల బాదలూ
అప్పులు పెనుముప్పులూ..పరిక్ష రాసె తిప్పలూ
తొర తొర తొరగా అన్నీ తెచ్చె తనలో కలిపే మందంటా
ముదరున్న ఈ భొగి మంటా
కల్లు కల్లపి జల్లి నిగిలోని చుక్కలే
పిల్ల పెట్టు ముత్యాల ముగ్గులలో
ఘల్లు ఘల్లున వచ్చె గంగిరెద్దు అడుగులకు
మడుగులొత్తు అందాల వాకిళ్లు
సిగ్గు పడుతూ సిగ్గు పడుతూ
సిగ్గు పడుతూ నిలుచుంది సంక్రాంతీ
సిగ్గు పడుతూ నిలుచుంది సంక్రాంతీ
ఎహ లేర చంటి…ఇంక నిదరేంటి
అట్ట చూస్తావేంటి…ఎహ రార బంటి
గంతులూ కేరింతలూ..చూరునవ్వుల గిలిగింతలూ
ఆసలు అః ఊహలు…మంచిని పంచే మనసులు
గబ గబ గబ గబ అన్ని కలిపి రుచిగా వండె మందంట
గుమ గుమలాడే పిండి వంటా
హైలో రంగా హరి దాసుల పాటలు
వీధులన్ని మారుమోగిపోతుంటే
అమ్మొ అమ్మో కొత్త అల్లుడోచ్చినాడని
అత్తగారు తత్తరబిత్తర పడుతుంటె
నవ్వుకుంటు నవ్వుకుంటు
నవ్వుకుంటు నిలుచుంది సంక్రాంతీ
నవ్వుకుంటు నిలుచుంది సంక్రాంతీ
ఎహ లేర చంటి…ఇంక నిదరేంటి
ఎహ రార బంటి…అట్ట చూస్తావేంటి
_____________________
మూవీ : రామ రామ కృష్ణ కృష్ణ (Rama Rama Krishna Krishna)
నటీనటులు: రామ్ (Ram), అర్జున్ (Arjun), ప్రియా ఆనంద్ (Priya Anand), బిందు మాధవి (Bindu Madhavi),
దర్శకత్వం: శ్రీవాస్ (Srivas)
గాయకుడు : కార్తీక్ (Karthik)
సంగీతం : MM కీరవాణి (MM Keeravani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.