Home » లేపాక్షి: జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను అందించే అద్భుత చారిత్రక కట్టడం

లేపాక్షి: జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను అందించే అద్భుత చారిత్రక కట్టడం

by Nikitha Kavali
0 comment

ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శ్రీ వీరభద్ర స్వామి గుడి ఉంది. ఈ గుడి ని లేపాక్షి అని కూడా పిలుస్తారు. లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మకమైన కట్టడం. ఈ ప్రదేశం లో మనం చూడవలసినవి, తెలుసుకోవలసినది చాల ఉంది.

లేపాక్షి కి చేరుకోవడం ఎలా:

లేపాక్షి కి చేరుకోవడానికి నేరుగా బస్సులు ఏమి లేవు. ఇక్కడికి చేరుకోవాలి అంటే దగ్గర్లో ఉన్న హిందూపూర్ అనే టౌన్ నుంచి బస్సు లేదా ఆటో లో చేరుకోవాలి. హిందూపూర్ లోని బస్టాండ్ లో దిగగానే అక్కడ లేపాక్షి కి వెళ్లే బస్సులు ఆటోలు బాగానే దొరుకుతాయి. లేపాక్షి నుంచి హిందూపుర్ కి 13 km దూరం ఉంటుంది.

లేపాక్షి లో చూడవలసిన ప్రదేశాలు

మీరు లేపాక్షి కి చేరుకోగానే ముందుగా అక్కడ మీకు 20 అడుగుల ఎత్తు 30 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద నంది  కనిపిస్తుంది, దీనిని ఒక్క రాయి నుంచే చెక్కబడింది. ఈ నంది దగ్గర నే ఒక పెద్ద తామరపువ్వుల కొలను ఒకటి ఉంటుంది అది చూడటానికి చాల అందంగా ఉంటుంది. ఈ నందిని ఇక్కడ చెక్కడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ నంది గుడి లోపల ఉన్న ఏడు పడగల నాగేంద్ర లింగానికి ఎదురుగా వచేతట్టు చెక్కేరు.

జటాయువు పార్క్:

అక్కడ జటాయు పార్క్ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద గ్రద్ద శిల ఉంటుంది. రామాయణం ప్రకారం రావణుడు సీత ను అపహరించి తీసుకు వెళ్తున్నప్పుడు జటాయు అనే పక్షి అడ్డుకోగా రావణుడు దాని రెక్కలను ఖండింస్తే ఆ పక్షి ఇక్కడే పడినట్లు చెబుతున్నాయి. అనంతరం సీత ను వెతుకుతున్న రాముడికి జటాయు ఇక్కడ పడి ఉండడం తెలిసి జటాయు ని తనలో ఐక్యం చేసుకొని మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ పార్క్ లో రాములవారు ప్రతిష్టించిన శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది.

వీరభద్ర స్వామి గుడి:

వీరభద్ర స్వామి గుడి లోపలనే చూడవలసిన చాల ప్రదేశాలు ఉన్నాయి, వేలాడే స్థంబాలు, సీత దేవి పాదాలు, లతా మండపం, ఏక శిలా నాగలింగం, ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వీరభద్రస్వామి గుడి శివుడి గదులలో ఎంతో ప్రాముఖ్యత పొందినది. 16వ శతాబ్దం లో కోశాధికారి అయినా విరూపాన్న అతని తమ్ముడు వీరన్న 70 స్తంభాలతో ఈ గుడి ని కట్టించారు. ఈ గుడి ప్రాంగణం లోనే  మండపం కూడా ఉంటుంది ఇక్కడ స్థంబాల మీద నాట్యం వేస్తున్న స్త్రీలు, దేవుడి బొమ్మలు ఎంతో అద్భుతంగా చెక్కి ఉన్నారు.

ఏక శిలా నాగలింగం

వీరభద్ర స్వామి గుడి లోకి రాగానే మీకు మొదట గా కనిపించేది ఈ ఏక శిలా నాగలింగం. ఇక్కడ శిల్పులు భోజన సమయం లో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ తల్లి వంట వండి వచ్చే లోపే ఈ నాగలింగాన్ని చెక్కారు అని అక్కడ వాసులు చెప్తున్నారు. ఈ నాగలింగానికి పక్కనే బాల గణేశుడు ఉంటాడు. మీరు వీరభద్ర స్వామి ని దర్శనం చేసుకోవడానికి వెళ్లే ముందు గా ఇక్కడ గణేశుడిని దర్శించుకోవాలి. 

వేలాడే స్థంభం

ఈ గుడిలో ఇంకో అద్భుతం ఏంటి అంటే వేలాడే స్థంభం, ఈగుడిలో ఉన్న అన్ని స్థంబాలు నేలకి ఆని ఉంటె ఒక్క స్థంబం మాత్రం గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఆలా ఎందుకు కట్టారు అంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఈ గుడి పడిపోకుండా ఈ ఒక్క స్థంభం నేలకు ఆని గుడిని రక్షిస్తుంది అంట.

కల్యాణ మండపం

ఈ గుడి వెనుక భాగంలో సగం కట్టడం తో ఆగిపోయి ఉన్నదే కల్యాణ మండపం. దీని వెనుక ఒక చిన్న చరిత్రే ఉంది. విరూపాన్న ఈ గుడిని రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ డబ్బు తో కడుతున్నాడు అని విరూపాన్న శత్రువులు రాజుకి చెప్పేరు. దీనితో విరూపాన్న రాజుగారి విదించబోయే శిక్షను ముందుగా తనకు తానే విధించుకున్నాడు, అతని రెండు కళ్ళను పీకేసుకొని అక్కడ ఉన్న గోడకి విసిరి కొట్టాడు. ఇప్పటికి ఆ గోడ మీద ఆ రక్తపు మరకలు అలానే ఉంటాయి. దీంతో ఆ కల్యాణ మండపం కట్టడం సగం లోనే ఆగిపోయింది. ఈ కల్యాణ మండపం మీద ఉన్న స్థంబాల మీద శివ పార్వతుల కల్యాణ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా చెక్కి ఉంటాయి.

సీత దేవి పాదం

ఈ గుడి నుంచి కొంచెం బయటికి వస్తే సీత దేవి పాదం ముద్ర కనిపిస్తుంది. ఈ పాదం లో ఎప్పుడు నీరు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ నీటిని తమ తల మీద జల్లుకుంటే శుభప్రదంగా భావిస్తారు.

లేపాక్షి ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న లేపాక్షి మన రాష్ట్రం లో ఉండడం మన అదృష్టం. ఈ ప్రదేశాన్ని మీ పిల్లలకు కచ్చితంగా చూపించండి. మన ఇతిహాసాలలో రామాయణం ఎన్నో నైతిక విలువలను నేర్పుతుంది. అటువంటి రామాయణం లోని స్నేహం విలువలను తెలిపే ఒక సంఘటన ఈ ప్రదేశం లో నే జరిగింది. ఇంత గొప్ప ప్రదేశాన్ని మనం గుర్తించి మన తరువాతి తరాలకు అందించడం మన బాధ్యత.

మరిన్ని సందర్శన ప్రదేశాల కోసం తెలుగు రీడర్స్ విహారి ని సందర్శించండి.

You may also like

Leave a Comment