Home » లేడి కన్నులదాన (Leddi Kannuladana) సాంగ్ లిరిక్స్ – Folk Song

లేడి కన్నులదాన (Leddi Kannuladana) సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comment

అతడు : లేడి కన్నులదాన నెమలి వన్నెలదాన
నిన్ను చూడ ముద్దయ్యేనే భామ
నీ మీద మానసయ్యేనే

ఆమె : వాలు మబ్బులవాడ
వలపు సూపులవాడ
వరసైన చిన్నోడివో బావ
వనమేలే చంద్రుడివో

అతడు : కుసుమ గంధపు చెట్ల
మంచెను కట్టినా
వరి గడ్డి వడి తిప్పి
వాడిచేలా చుట్టినా
పాలపిట్టల వోలె పరువాలు ఒలికించ
పండువెన్నెల వేళా రావే ఓ రమణిలా

ఆమె : ముద్దబంతిల వోలె మురిసిన నీ సూపుల్లో
నిద్దుర మరచిన ఓ నిండు చంద్రుడా
నా అన్నదమ్ములు అరుగుల మీదుంటే
వాక్కిలు దాటంగా ఆలస్యంమైంది

అతడు : లేడి కన్నులదాన నెమలి వన్నెలదాన
నిన్ను చూడ ముద్దయ్యేనే భామ
నీ మీద మానసయ్యేనే

నీలి పరికిణి కట్టి నిండు పున్నమి వేళా
నెమలోలే నిలుచున్నావే భామ
నెలంతా మెరిసినవే

ఆమె :సన్నజాజుల మీద చేమగిల్లిపొయ్యే
ఆ కొంటె తూనీగవో బావ
అందాల సూర్యుడివో
అతడు : బంగారు సిరులున్న భామ
నీ నవ్వుల్లా అమృతం ఒలికిందే
ఆ వెండి వెన్నెల
ఆకాశ విధుల్ల అందాల గోరింకా
ఎదురుంగా నువ్వుంటే ఏమౌదో జగమంతా

ఆమె :తనువంతా పులకించే నీ తేనెమాటల్లో
ఊయ్యాలలూగింది మనసంతా ఈ వేళా
మసాగా సంధులు ధాటి మా ఇంటి దారుల్లా
మాయ మాటలతోనే నా ఏంటా రాబోకు

అతడు : లేడి కన్నులదాన నెమలి వన్నెలదాన
నిన్ను చూడ ముద్దయ్యేనే భామ
నీ మీద మానసయ్యేనే

కారుమబ్బులు జారి చిక్కటి
పొంగెట్టి పొదరిల్లువే పిల్ల
రంగుల హరివిల్లువే

ఆమె : మల్లె తోటలకాడ మలుపు దారులుకాడ
మాటేసి నిలుచున్నవో బావ
మనసైన చిన్నోడివో

అతడు : నెరజాన నీ వెనక నీడల్లే వస్తున్న
నా పంచ ప్రాణాలు నీ చేతికిస్తున్న
అలిసిన గుండెల్లో అందాల నెలవంక
కాదంటే నీకింకా కడసూపు నేనౌతా

ఆమె : మొగలి మోదుగుపూల ఓ నీలి నెలరాజా
నీ ప్రేమ లోతుల్లో మూలిగేను ఈ వేళా
అవనీ అలులు ధాటి అడుగుల్లో అడుగేసి
నిండు జాబిల వోలె నిన్ను చెర వస్తున్న

అవనీ అలులు ధాటి అడుగుల్లో అడుగేసి
నిండు జాబిల వోలె నిన్ను చెర వస్తున్న

__________________________________________________

పాట: లేడి కన్నులదాన (Leddi Kannuladana)
సంగీతం: కళ్యాణ్ కీస్ (KALYAN KEYS )
సాహిత్యం: మహేందర్ ముల్కల (MAHENDER MULKALA)
తారాగణం: కార్తీక్ రెడ్డి (KARTHIK REDDY), లాస్య స్మైలీ (LASYA SMILY)
గాయకులు: సుమన్ బదనకల్ (SUMAN BADANAKAL), శ్రీనిధి (SRINIDHI)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment