హాయ్ తెలుగు రీడర్స్ | డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి మంచి అవకాశం వచ్చేసింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ పోస్టుల ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇన్సూరెన్స్ కంపెనీలో స్థిరమైన గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెతుకుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి. వివరాలలోకి వెళితే…
కోల్‌కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) ప్రధాన కార్యాలయం గ్రాడ్యుయేషన్ హోల్డర్లకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ 500 అసిస్టెంట్ (క్లాస్ III) ఖాళీల కోసం NICL అసిస్టెంట్ నోటిఫికేషన్ 2024ని విడుదల చేసింది.
అర్హతలు
అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. అంతేకాక అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిఉండాలి .
వయస్సు
- 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు 5 సంవత్సరాలు సడలింపు.
- ఇతర వెనుకబడిన తరగతులు (OBC, నాన్-క్రీమీ లేయర్) 3 సంవత్సరాలు సడలింపు.
- బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు 10 సంవత్సరాలు సడలింపు.
- మాజీ సైనికుడు. డిసేబుల్డ్ ఎక్స్-సర్వీస్‌మెన్ రక్షణ దళాలలో అందించిన వాస్తవ సేవా కాలం + 3 సంవత్సరాలు, గరిష్టంగా 45 సంవత్సరాలు.
- వితంతువులు, విడాకులు పొందిన స్త్రీలు మరియు స్త్రీలు తమ భర్తల నుండి చట్టబద్ధంగా విడిపోయారు, సాధారణ/EWSకి 35 సంవత్సరాల వయస్సు వరకు వయస్సు రాయితీ.
- OBCకి 38 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 40 సంవత్సరాలు వరకు.
- కంపెనీలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 5 సంవత్సరాలు సడలింపు.
ఖాలీలు
రాష్ట్రం | SC | ST | OBC | EWS | UR | మొత్తం |
ఆంధ్ర ప్రదేశ్ | — | 2 | 7 | 2 | 10 | 21 |
అరుణాచల్ ప్రదేశ్ | — | — | — | — | 1 | 1 |
అస్సాం | 2 | 2 | 7 | 2 | 9 | 22 |
బీహార్ | — | — | — | 1 | 9 | 10 |
ఛత్తీస్‌గఢ్ | 2 | 5 | — | 1 | 7 | 15 |
గోవా | — | — | — | — | 3 | 3 |
గుజరాత్ | 2 | 4 | 9 | 3 | 12 | 30 |
హర్యానా | — | — | — | — | 5 | 5 |
హిమాచల్ ప్రదేశ్ | — | — | 1 | — | 2 | 3 |
జార్ఖండ్ | 1 | 1 | 2 | 1 | 9 | 14 |
కర్ణాటక | 3 | 1 | 12 | 4 | 20 | 40 |
కేరళ | 2 | — | 11 | 3 | 19 | 35 |
మధ్యప్రదేశ్ | — | 06 | 2 | 1 | 07 | 16 |
మహారాష్ట్ర | 6 | 3 | 12 | 5 | 26 | 52 |
మణిపూర్ | — | — | — | — | 1 | 01 |
మేఘాలయ | — | — | — | — | 2 | 2 |
మిజోరం | — | — | — | — | 1 | 1 |
నాగాలాండ్ | — | — | — | — | 1 | 1 |
ఒడిశా | 2 | 3 | — | 1 | 4 | 10 |
రాజస్థాన్ | — | — | 3 | 1 | 6 | 10 |
పంజాబ్ | 3 | 1 | 7 | 3 | 21 | 35 |
సిక్కిం | — | — | — | — | 1 | 1 |
తమిళనాడు | — | — | 9 | 3 | 23 | 35 |
తెలంగాణ | 1 | 1 | 4 | 1 | 5 | 12 |
త్రిపుర | — | — | — | — | 2 | 2 |
ఉత్తర ప్రదేశ్ | — | — | 5 | 1 | 10 | 16 |
ఉత్తరాఖండ్ | 3 | — | 2 | 1 | 6 | 12 |
పశ్చిమ బెంగాల్ | 15 | 1 | 13 | 5 | 24 | 58 |
అండమాన్ & నికోబార్ దీవులు | — | — | — | — | 1 | 1 |
చండీగఢ్ | — | — | 1 | — | 2 | 3 |
ఢిల్లీ | 1 | 3 | 5 | 2 | 17 | 28 |
జమ్మూ & కాశ్మీర్ | — | — | 1 | — | 1 | 2 |
లడఖ్ | 1 | 3 | 5 | 2 | 17 | 28 |
పాండిచ్చేరి | — | — | — | — | 2 | 2 |
మొత్తం | 43 | 33 | 113 | 41 | 270 | 500 |
ఎంపిక విధానం
ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ప్రాంతీయ భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్టేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) – ఈ పరీక్ష 100 ప్రశ్నలు.. 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు). పరీక్ష వ్యవధి మాత్రం 60 నిమిషాలు ఉంటుంది. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ – 1/4 కూడా ఉంటుంది.
స్టేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) – ఈ పరీక్ష 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు) పరీక్ష వ్యవధి మాత్రం 120 నిమిషాలు ఉంటుంది. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ – 1/4 కూడా ఉంటుంది.
స్టేజ్ 3- ప్రాంతీయ భాషా పరీక్ష
పరీక్షా కేంద్రాలు
NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ తో పాటు పరీక్షా కేంద్రాల జాబితా కూడా విడుదల చేయబడింది. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు తమకు ఇష్టమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు | సెంటర్ లొకేషన్ |
ఆంధ్ర ప్రదేశ్ | విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు |
అస్సాం | గౌహతి, దిబ్రూగర్, సిల్చార్, జోర్హాట్ |
అరుణాచల్ ప్రదేశ్ | నహరియగున్ |
బీహార్ | పాట్నా, గయా, భాగల్పూర్ |
చండీగఢ్ | చండీగఢ్/మొహాలి |
ఢిల్లీ-NCR | ఢిల్లీ-NCR |
గోవా | పనాజీ |
గుజరాత్/దాద్రా & నగర్ హవేలీ/డామన్ & డయ్యూ | అహ్మదాబాద్/గాంధీ నగర్, వడోదర, సూరత్, రాజ్‌కోట్ |
హర్యానా | హిస్సార్, ఫరీదాబాద్, గుర్గావ్ |
హిమాచల్ ప్రదేశ్ | సిమ్లా, మండి |
జమ్మూ & కాశ్మీర్/లడఖ్ | శ్రీనగర్, జమ్ము, లేహ్ |
జార్ఖండ్ | రాంచీ, జంషెడ్‌పూర్ |
కర్ణాటక | బెంగళూరు, హుబ్లీ/ధార్వాడ్, మంగళూరు, మైసూర్ |
కేరళ | ఎర్నాకులం/కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్ |
మధ్యప్రదేశ్ | భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్ |
మహారాష్ట్ర | ముంబై/నవీ ముంబై/థానే/MMR, నాగ్‌పూర్, పూణే, ఛత్రపతి శంభాజీ నగర్, నాసిక్ |
మణిపూర్ | ఇంఫాల్ |
మేఘాలయ | షిల్లాంగ్ |
మిజోరం | ఐజ్వాల్ |
నాగాలాండ్ | కోహిమా, దిమాపూర్ |
ఒడిశా | భువనేశ్వర్, కటక్, రూర్కీ, బెర్హంపూర్ |
పుదుచ్చేరి | పుదుచ్చేరి |
పంజాబ్ | అమృత్సర్, లూథియానా, భటిండా |
రాజస్థాన్ | జైపూర్, జోధ్‌పూర్, బికనీర్ |
సిక్కిం | గాంగ్టక్ |
తమిళనాడు | చెన్నై, కోయంబత్తూరు, మధురై |
తెలంగాణ | హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్ |
త్రిపుర | అగర్తల |
ఉత్తర ప్రదేశ్ | లక్నో, అలహాబాద్ కాన్పూర్ నోయిడా/గ్రేటర్ నోయిడా |
ఉత్తరాఖండ్ | డెహ్రాడూన్, హరిద్వార్, హల్ద్వానీ |
పశ్చిమ బెంగాల్ | కోల్‌కతా/ గ్రేటర్ కోల్‌కతా, సిలిగురి, అసన్సోల్ |
అండమాన్ & నికోబార్ | పోర్ట్ బ్లెయిర్ |
జీతం
నెలకు రూ.22,405- రూ.62,265 ఉంటుంది. ఇది వారికి పోస్టింగ్ ఇవ్వబడిన ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది.
అప్లై చేసే విధానం
దరఖాస్తు ఫీజు: రూ.850.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: అక్టోబర్ 24, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 11, 2024.
దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: అక్టోబర్ 24 నుంచి నవంబర్ 11 వరకు.
ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్ 30, 2024
ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 28, 2024
దరఖాస్తు కొరకు సంప్రదించండి : https://ibpsonline.ibps.in/niclaoct24/
మరిన్ని వివరాలకొరకు NICL ఓఫిషల్ సైట్ https://nationalinsurance.nic.co.in/recruitment సంప్రదించండి
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ జాబ్స్ ని సందర్శించండి