హాయ్ తెలుగు రీడర్స్ | బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి మంచి అవకాశం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ అర్హతతో 1500 పోస్టుల కోసం దరఖాస్తులను ప్రారంభించింది. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 13. ఉద్యోగం కోసం వెతుకుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి. వివరాలలోకి వెళితే…
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ 2024ని విడుదల చేసింది.
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
అంతేకాక అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిఉండాలి .
వయస్సు
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.10.2024 నాటికి కనీస వయో పరిమితి 20, గరిష్ట వయో పరిమితి 30.
- షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు 5 సంవత్సరాలు సడలింపు.
- ఇతర వెనుకబడిన తరగతులు (OBC) (నాన్-క్రీమీ లేయర్) 3 సంవత్సరాలు సడలింపు
- బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు 10 సంవత్సరాలు సడలింపు.
- ఎమర్జెన్సీతో సహా మాజీ సైనికులు, కమిషన్డ్ అధికారులు, కమిషన్డ్ అధికారులు (ECOలు/షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లు
(SSCOలు) కనీసం 5 సంవత్సరాల సైనిక సేవను అందించిన వారికి 5 సంవత్సరాలు సడలింపు - 1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన వ్యక్తులకు 5 సంవత్సరాలు
ఖాలీలు
ఎంపిక విధానం
స్టేజి 1 : ఆన్‌లైన్ ఎగ్జామినేషన్
ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలు గుర్తించినట్లయితే ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో నాల్గవ వంతు తీసివేయబడుతుంది.
అభ్యర్థి ఆన్‌లైన్ పరీక్ష యొక్క ప్రతి పరీక్షలో కనీస స్కోర్‌ను పొందవలసి ఉంటుంది. అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి, కటాఫ్ మార్కులు నిర్ణయించబడతాయి మరియు అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు
స్టేజి 2 : లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT):
అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం మరియు మాట్లాడటం) కలిగి ఉండాలి.
లాంగ్వేజ్ ప్రావీణ్యత పరీక్షలో అర్హత సాధించడానికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు, అది విఫలమైతే వారు తరువాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ హాజరుకావడానికి అనుమతించబడరు. అనగా తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం ఇంటర్వ్యూ మరియు వారి అభ్యర్థిత్వం పరిగణించబడదు.
10వ లేదా 12వ తరగతి మార్కుషీట్/సర్టిఫికేట్ లలో ఉన్న నిర్దిష్ట స్థానిక భాష సబ్జెక్ట్‌లలో టెస్ట్ పాల్గొనాల్సిన అవసరం లేదు. రాష్ట్రం లో ఉన్న భాష ప్రావీణ్యత పరీక్షలో మాత్రమే పాల్గొనాల్సిన అవసరం ఉంది.
స్టేజి 3: పర్సనల్ ఇంటర్వ్యూ
పరీక్షా కేంద్రాలు
జీతం
నెలకు రూ.48480- రూ.85920 ఉంటుంది. ఇది వారికి పోస్టింగ్ ఇవ్వబడిన ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది.
అప్లై చేసే విధానం
దరఖాస్తు ఫీజు: రూ.850.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.175 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులో
ఎ) అప్లికేషన్ రిజిస్ట్రేషన్ (దరఖాస్తు నమోదు)
బి) పేమెంట్ ప్రోసెస్ (ఫీజు చెల్లింపు)
c) ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ బొటనవేలు ముద్ర & చేతితో వ్రాసిన ప్రకటన స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది
అభ్యర్థులు ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక రాష్ట్రంలోని ఖాళీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఇతర రాష్ట్రంలోని ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: అక్టోబర్ 24, 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 13, 2024.
👉 అప్లై చేయడానికి https://ibpsonline.ibps.in/ubilbooct24/
👉 మరిన్ని వివరాలకొరకు https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ జాబ్స్ ని సందర్శించండి