Lambadi Vadalla Folk Song Lyrics
అరె లంబాడి వాడల్లా
నువ్వు నేను గలవంగా
ఈ ప్రేమే మొదలైయిందో
తొలి ప్రేమే నాలోనే పుట్టిందమ్మో
అరె మనసంతా నిండుగా
నీ ప్రేమ జల్లులు పడుతుంటే ఎదలో ఇలా
సిగ్గెదో పొంగిందే గోదారిలా
నెమలమ్మ నాట్యాలు నీ హంస నడకల్లో
చూస్తుంటే బాగుందిలే..
ఆ దొంగ సూపుల్లో నన్ను పిలిచే తొందర్లు
చూస్తుంటే హాయి హాయిలే..
మా అయ్యా అవ్వ చూసారో చేస్తారు లగ్గాలు
వెళ్ళొయి తుంటరోడా..
అరె లల్లాయి లాలీ జో
నాకు నీ ప్రేమే చాలు పో
అరె లల్లాయి లాలీ జో
బతుకంతా తోడుంటే చాలు పో
అరె లంబాడి వాడల్లా
నువ్వు నేను గలవంగా
ఈ ప్రేమే మొదలైయిందో
తొలి ప్రేమే నాలోనే పుట్టిందమ్మో
నే పనిమీద పోతుంటే ఈ పిల్ల గాలులు
నీవైపే తీసుకొచ్చే దారంతా నీ రూపే గీసుకొచ్చే
అరె పొలమారి పోతుంటే నీ తలపే అనుకుంటూ
నే మురిసి పోతుంటిలా నిజమయి ఎదురొచ్చావేంటిలా
నీ చీర చెంగుల్లో నలిగేటి నడుమును చూస్తుంటే బాగుందిలే..
చినుకమ్మ తొందరలు మేరుపమ్మ అల్లరులు పెడుతుంటే హాయి హాయిలే..
అదిగదిగో మా అన్న వస్తున్నాడు ఆ వంక దారికామో అంతేనులే..
అరె లల్లాయి లాలీ జో
నాకు నీ ప్రేమే చాలు పో
అరె లల్లాయి లాలీ జో
బతుకంతా తోడుంటే చాలు పో
అరె లంబాడి వాడల్లా
నువ్వు నేను గలవంగా
ఈ ప్రేమే మొదలైయిందో
తొలి ప్రేమే నాలోనే పుట్టిందమ్మో
నా అత్త నా మామ ఒట్టేసి చెబుతున్న
నీ బిడ్డ కన్నులోన నేను కన్నీళ్ళు రానియ్యనే
మీ నిండు దీవెనలు ఉండాలి మా పైన బతుకంతా సంతోషమే
ఇక విరిసెను మధుమాసమే
ఆకాసతరాలే అక్షింతలవుతుంటే ఈ కనులే తడిసెనులే
ఏడుఅడుగులేస్తు నీ వంక చూస్తుంటే మనసెంతో పొంగిందిలే
నువ్వు కట్టిన తాళి ఈ ఊరే సాక్షి అయ్యాము ఒక ప్రాణమే
అరె లల్లాయి లాలీ జో
నాకు నీ ప్రేమే చాలు పో
అరె లల్లాయి లాలీ జో
బతుకంతా తోడుంటే చాలు పో
అరె లంబాడి వాడల్లా
నువ్వు నేను గలవంగా
ఈ ప్రేమే మొదలైయిందో
తొలి ప్రేమే నాలోనే పుట్టిందమ్మో
Song Credits:
పాట పేరు: లంబాడి వడల్లా (Lambadi Vadalla)
సాహిత్యం – కాన్సెప్ట్ – దర్శకత్వం: వినీత్ నమిండ్ల (Vineeth Namindla)
నిర్మాత: కృష్ణ లింగబత్తిని (Krishna Lingabatthini)
నటీనటులు: యమునా తారక్ (Yamuna Tarak), గిరిధర్ కలసాని (Giridhar Kalasani)
గాయకులు: సుమన్ బదనకల్ (Suman Badanakal), శ్రీనిధి (Srinidhi)
సంగీతం: మార్క్ ప్రశాంత్ (Mark Prashanth)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.