లాలి పడుతున్నది (Laali Paduthunnadi) సాంగ్ లిరిక్స్, Jhummandi Naadam

by Lakshmi Guradasi

లాలి పాడుతున్నది ఈ గాలీ
ఆ లాలి రాగాలలో నువ్వు ఊయల ఊగాలీ
లాలి పాడుచున్నది ఈ గాలీ
ఆ లాలి రాగాలలో నువ్వు ఊయల ఊగాలీ

ఎలా యాలా ఎలా యాలా హైలెస్సో
ఐలా పట్టు హైలెస్సా
బల్లకట్టు హైలెస్సా
అద్దిరా బాబు హైలెస్సా
అక్కడ పట్టు హైలెస్సా

సన్నజాజీ చీరకట్టీ
సిన్నాదొచ్చి హైలెస్సా
కన్నూగొట్టే హైలెస్సా
తన్నానన్నా తిన్నానా
తన్నానన్నా హైలెస్సా

గాలి కోసల లాలి ఆ పూల తీగకు
వేలి కోసల లాలి ఈ బోసి నవ్వుకూ

బుడి బుడి నడకలకు భూమాత లాలి
ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మా లాలి
ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి
కూహూ కూహూ
చెంగు చెంగు గంతులకు
చందమామలో దాగివున్న కుందేలమ్మ లాలి

నా లాలి నీకు పూల పల్లకీ
అలసిన కళ్ళకీ సొలసిన కాళ్ళకీ

ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మా
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మా
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ

గుమ్మాడి సెట్టు మీద ఆట చిలకల్లారా
పాటా చిలకల్లారా కలికి చిలకల్లారా
కందుమ్మ గడ్డలు కలవారి మెడలు
ముత్యపు గొడుగులు మురిపాల మెరుగులు
రంగు రుద్రాక్షలు తీరు గోరింటాలు
పేరు రుద్రాక్షలు పరుగుల కట్టలు

ఏమేమి పూవొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మా
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ

వెన్నముద్ద లాలి చిన్నారి మేనికీ
గోరుముద్ద లాలి బంగారు బొమ్మకీ

ఓనమాలు పలికితే పలకమ్మ లాలి
బాలశిక్ష చదివితేమ్ పలుకుళమ్మ లాలి
దినదినము ఎదుగుతుంటే దినకారుని లాలి
పదుగురోచ్చ్చి నిను మెచ్చితే
కన్నులారా చూసే తల్లికి కడుపు తీపి లాలి

నా లాలి నీకు పూల పల్లకీ
అలసిన కళ్ళకీ సొలసిన కాళ్ళకీ

లాలి పాడుతున్నది ఈ గాలీ
ఆ లాలి రాగాలలో నువ్వు ఊయల ఊగాలీ

In English Version:

Lali paadutunnadi ee gaali
Aa lali raagaalalo nuvvu uyala ugaali
Lali paaduchunnadi ee gaali
Aa lali raagaalalo nuvvu uyala ugaali

Ela yaala ela yaala hailesso
Aila pattu hailessa
Ballakattu hailessa
Addira baabu hailessa
Akkada pattu hailessa

Sannajaaji cheerakatti
Sinna dochchi hailessa
Kannugotte hailessa
Tannaanannaa tinnanaa
Tannaanannaa hailessa

Gaali kosala lali aa poola teegaku
Veli kosala lali ee bosi navvuku

Budi budi nadakalaku bhoomaata lali
Muddu muddu palukulaku chilakamma lali
Unga unga sangeetalaku koyilamma lali
Koohoo koohoo
Chengu chengu gantalaku
Chandamaamalo daagivunna kunde lamma lali

Naa lali neeku poola pallaki
Alasina kallaki solasina kaallaki

Ememi poovoppune Gauramma
Ememi kaayoppune Gauramma
Gummaadi poovoppune Gauramma
Gummaadi kaayoppune Gauramma
Ememi poovoppune Gauramma
Ememi kaayoppune Gauramma
Gummaadi poovoppune Gauramma
Gummaadi kaayoppune Gauramma

Gummaadi settu meeda aata chilakallara
Paata chilakallara kaliki chilakallara
Kandumma gaddalu kalavaari medalu
Mutyapu godugulu muripaala merugulu
Rangu rudraakshalu teeru gorintaalu
Peru rudraakshalu parugula kattalu

Ememi poovoppune Gauramma
Ememi kaayoppune Gauramma
Gummaadi poovoppune Gauramma
Gummaadi kaayoppune Gauramma

Vennamudda lali chinnaari meniki
Gorumudda lali bangaara bommaki

Onamaalu palikite palakammaa lali
Baala shiksha chadivitem palukulamma lali
Dinadinamu edugutunte dinakaaruni lali
Padugurocchi ninu mechchite
Kannulaara choose talliki kadupu teepi lali

Naa lali neeku poola pallaki
Alasina kallaki solasina kaallaki

Lali paadutunnadi ee gaali
Aa lali raagaalalo nuvvu uyala ugaali

______________

Song Credits:

పాట: లాలి పడుతున్నది (Laali Paduthunnadi)
చిత్రం: ఝుమ్మంది నాదం (Jhummandi Naadam)
నటీనటులు: మనోజ్ మంచు (Manoj Manchu), తాప్సీ పన్ను (Taapsee Pannu)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani)
లిరిసిస్ట్: సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja)
గాయకులు: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam), గీతా మాధురి (Geetha Madhuri)

govinda hari govinda song lyrics jhummandi naadam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like