Home » కుందేలు తెలివి – కథ

కుందేలు తెలివి – కథ

by Haseena SK
0 comment

ఒక పెద్ద అడవిలో ఒక అమాయకపు కుందేలు నివసిస్తూ ఉండేది. ఒక రోజు బాగా ఎండగా ఉండడం వలన కుందేలు తాటిచెట్టు క్రింద పడుకొని నిద్రపోతూ ఉండగా అప్పుడే అకస్మాత్తుగా మేఘాలు మబ్బులు కమ్ము కొని  బాగా గాలివీచడం మొదలయింది. ఇంతలో తాటిచెట్టుపై నుండి ఒక తాటికాయ రాలి కుందేలు వెనుకవైపుగా పడింది. ఆ శబ్దానికి కుందేలు పైకి లేచి చూసింది. అప్పుడు ఆకాశంలో ఉరుములు, మెరుపులు చూసి కుందేలు భయపడింది. వెంటనే నామీద ఆకాశం విరిగి పడిపోతున్నది అని అనుకుని  అక్కడ నుంచి పరుగులు తీయడం మొదలుపెట్టింది. కొంత దూరం వచ్చాక దానికి ఒక నక్క కనిపించింది. అప్పుడు ఆ నక్క ఎందుకు అలా పరుగు తీస్తున్నావు అని కుందేలును అడిగింది. దానికి కుందేలు ఆకాశం విరిగి పడిపోతుంది,  నేను తాటిచెట్టు కింద నిద్రపోతూవుండగా కొంచం విరిగి నా మీద పడ్డది. దాని నుండి తప్పించుకోవడానికి పరిగెడుతున్నాను, నువ్వు కూడా బ్రతకాలంటే నాతోపాటు పరిగెత్తు అని చెప్పింది. ఇలా కుందేలు, నక్క పరుగులు తీస్తూ ఉండగా వాటిని ఒక జింక చూసింది. జింక ఎందుకు మీరు పరుగులు తీస్తున్నారు అని అడిగింది. అప్పుడు అవి ఆకాశం విరిగి పడిపోతుంది, దాని నుండి తప్పించుకోవడానికి పరిగెడుతున్నాము, నువ్వు కూడా బ్రతకాలంటే మాతోపాటు పరిగెత్తు అని చెప్పాయి. అప్పుడు అన్నీ కలసి పరుగు మొదలెట్టాయి. ఇలా వాటికి రకరకాల జంతువులన్నీ జతకలసి పరుగులు తీశాయి. ఇలా అవన్నీ పరుగులు తీస్తూవుండగా వాటికి ఒక సింహం కనిపించింది. అప్పుడు సింహం వాటిని ఎందుకు పరుగులు  తీసున్నారు అని అడిగింది.  అప్పుడు కుందేలు ఆకాశం విరిగి పడిపోతుంది, కొంచం నా మీద పడిపోయింది అని చెప్పింది. అప్పుడు సింహం పగలబడి నవ్వి, ఎక్కడ పడిందో చూపించు అని చెప్పింది. అప్పుడు కుందేలు ఆ తాటిచెట్టు దగ్గరికి తీసుకువెళ్లింది. అప్పుడు సింహం అక్కడ బాగా వేతికితే ఒక తాటికాయ రాలిపడి ఉండడాన్ని గమనించి అన్ని జంతువులను వివరంగా చెప్పింది. అప్పుడు కుందేలు సిగ్గుతో తలదించుకుంది.  మిగతా జంతువులు అన్ని  కుందేలు వైపు చూసి, కుందేలు అమాయకత్వానికి జాలిపడి నువ్వతూ అక్కడినుండి వెళ్ళిపోయాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment