కూలి నాలి చేసి కొన్ననే బంగారు తాళి బొట్టు
కూడు ముట్టకుండా కూడ పెట్టినానే నీ మీదొట్టు
కొంగు ముడి కోసమని కొన్నానే కంచి పట్టు
కోరుకున్నదానివని తిరిగినానే నీ సుట్టు
అందనంత దూరమే నువ్వే పొతే
ఆశలన్నీ ఆవిరల్లే చేసి పోతే
ప్రాణమన్న ప్రేమే నువ్వు మరిచిపోతే
ఉంటానన్న తోడే నువ్వు విడిపోతే
సచ్చిపోతున్నానే.. నువ్వు లేవన్న ముచ్చట యాదికొస్తే
పోతున్నానే.. కాలిపోతానని కాటికే
సచ్చిపోతున్నానే.. నువ్వు లేవన్న ముచ్చట యాదికొస్తే
పోతున్నానే.. కాలిపోతానని కాటికే
గుడెసేలున్న గాని నన్ను గుణము గల్లావాడివంటివి
మాసిన అంగి ఏసిన నన్ను మనసు బంగారం అంటివి
కూలి చేసుకొనే నన్ను కూడి ఉందామంటివి
కడుపు నిండా తిండెట్టకున్నా కలిసిపోదామంటివి
చీకటైన ఎన్నెలవోలె ఉంటానంటివి
చిమ్మటి చీకటిలో వదిలెళ్ళిపోతివి
సిక్కులన్నీ చేయి పట్టుకు దాటుదామంటివి
చెప్పకుండా భాదల్లో నెట్టేసిపోతివి
సచ్చిపోతున్నానే.. నువ్వు లేవన్న ముచ్చట యాదికొస్తే
పోతున్నానే.. కాలిపోతానని కాటికే
సచ్చిపోతున్నానే.. నువ్వు లేవన్న ముచ్చట యాదికొస్తే
పోతున్నానే.. కాలిపోతానని కాటికే
పాలెరల్లే ఉండే నన్ను ప్రేమగా నువ్వే హత్తుకుంటివి
పెడకళ్ళు ఎత్తే సెయిని చెంపకే పెట్టుకుంటివి
మట్టిలో మెదిలే నన్ను ముద్దు నువ్వే ఎట్టుకుంటివి
బాంచన్ అని మొక్కే నన్ను భర్తగా కావాలంటివి
పేదోనింట ప్రేమగా నువ్వే ఉంటానంటివే
పెళ్లి చేసుకొని ఇంకోనింటికి పోతివే
ప్రాణమే పోయేవరకు నీతోనంటివే
పరాయోని పిల్లలకే తల్లివి అయితివే
సచ్చిపోతున్నానే.. నువ్వు లేవన్న ముచ్చట యాదికొస్తే
పోతున్నానే.. కాలిపోతానని కాటికే
సచ్చిపోతున్నానే.. నువ్వు లేవన్న ముచ్చట యాదికొస్తే
పోతున్నానే.. కాలిపోతానని కాటికే
______________
సాంగ్ : కూలి నాలి (Kuli Naali)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
సాహిత్యం : సురేష్ కడారి (Suresh Kadari)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
దర్శకుడు : మున్నా (Munna)
నటీనటులు : కిట్టు పవన్ (Kittu Pavan) & మౌనిక డింపుల్ (Mounika Dimple)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.