Home » కొల్లగొట్టినాదిరో (Kollagottinadhiro) సాంగ్ లిరిక్స్ Hari Hara Veera Mallu | Pawan Kalyan

కొల్లగొట్టినాదిరో (Kollagottinadhiro) సాంగ్ లిరిక్స్ Hari Hara Veera Mallu | Pawan Kalyan

by Lakshmi Guradasi
0 comments

Kollagottinadhiro song lyrics: “కొల్లగొట్టినాదిరో” (Kollagottinadhiro) – మర్చి పోలేని ఓ గీతం! హరి హర వీరమల్లు చిత్రానికి శక్తివంతమైన సంగీతాన్ని అందించిన ఎం.ఎం. కీరవాణి, చిరస్మరణీయమైన పదాలతో చంద్రబోస్, తమ అద్భుత గానంతో మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల గాయకులుగా ఈ పాటను మరింత శక్తివంతం చేశారు. లోకేశ్వర్ ఈదర, సాయి చరణ్, అరుణ్ కౌండిన్య, ఐరా ఉడిపి, లిప్సికా భాష్యం, వైష్ వంటి కోరస్ గాయకుల హార్మోనీ ఈ గీతానికి కొత్త ఊపునిస్తుంది.

పవన్ కళ్యాణ్ పరాక్రమాన్ని తెరపై ఆవిష్కరించే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తేజాన్ని నిండుగా మేళవించిన ఈ పాట శ్రోతలను ఉర్రూతలూగించే స్థాయిలో ఉంది!

Kollagottinadhiro song lyrics in Telugu:

కొర కొర మీసాలతో, కొదమ కొదమ అడుగులతో
కొంటె కొంటె చెనుకులతో, కొలిమిలాంటి మాగటితో
సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు
ఎదో ఎదో తలచినాడు ఎవ్వరినో వేతికినాడు
ఎవరంట… ఎవరంట… ఎవరెవరంట
ఎవరంట ఎవరంట ఎవరెవరెవరెవరంట

కొండపల్లి ఏండి బొమ్మ
కోల కళ్లతో చూసిందమ్మా
తీయ్యతీయ్యని తేనెలకొమ్మ
తీయని తెరలే తీసిందమ్మా

వజ్రాల జిలుగులున్నా
రత్నాల ఏలుగులున్న
కెంపుల్లా ఒంపులున్న
మొహరీలా మెరుపులున్నా..
నా పైడి గుండెలోన ఏడి పుట్టించి
మరిగించి మరిగించి కరగించి కరగించి

కొల్లగొట్టినాదిరో…..కొల్లగొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో…..కొల్లగొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో…ముల్లెగట్టినాదిరో…

నరిన్ననో.. నరిన్ననో.. నరిన్ననో….
నరిన్న నరిన్ననో..

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో…..
ఆ చిన్నది.. ఇంకేమి చేసిందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో…
ఆ కుర్రది.. ఏ మంత్రం ఏసిందయ్యో..

కన్నులలోని కాటుక మేఘం
సీకటి నాపై సిలికిందే
మాటలతోనే మెలికేసిందే
మర్మం ఎదో దాసిందే

ఆడవాళ్ళ మనసు అడవిలాంటిదాని
ఎరగని సంటోడివా
అంతా అమాయకుడివా
పడుసుపిల్ల తీరు పట్టుసిక్కాదని పసిగట్టలేనోడివా
ఓట్టి శొంటికొమ్మువా…
లేత ఎన్నపూసవా….

అరె మీసాల రోశల మొనగాన్ని పట్టేసి
పసివాణ్ణి చేసేసి పసరేదో పూసేసి…

కొల్లగొట్టినాదిరో…..కొల్లగొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో…..కొల్లగొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో…ముల్లెగట్టినాదిరో…

నరిన్ననో.. నరిన్ననో.. నరిన్ననో…. ఓ
నరిన్న నరిన్ననో..

హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్

ఊపిరిలోని ఆవిరిపావనాలే
విరివిగా లేఖలే విసిరేనే
ఉప్పెనలాగ పొంగే పౌరుషమే
సొగసుకు సంకెలా వేసేనే

ఊపిరిలోని ఆవిరిపావనాలే
విరివిగా లేఖలే విసిరేనే
ఉప్పెనలాగ పొంగే పౌరుషమే
సొగసుకు సంకెలా వేసేనే

చీకుచింత లేని వాడి చిత్తం దోచావే
పారహుషార్ పోరగాడ్ని పాగల్ చేసావే
దారెదైనా దవ్వెదైన నీడై ఉంటనే
పేరైనా తీరేదైన పెనిమిటి అంటానే
అడ్డెడ్డే ….

కొల్లగొట్టినాదిరో…..కొల్లగొట్టినాదిరో
కొల్లగొట్టి నా గుండెనే ముల్లెగట్టినాదిరో
కొల్లగొట్టినాదిరో…..కొల్లగొట్టినాదిరో
ముల్లెగట్టినాదిరో…ముల్లెగట్టినాదిరో…

నరిన్ననో.. నరిన్ననో.. నరిన్ననో….
నరిన్న నరిన్ననో

నరిన్ననో.. నరిన్ననో.. నరిన్ననో….
నరిన్న నరిన్ననో

Kollagottinadhiro song lyrics in English:

Kora Kora Meesalatho, Kodama Kodama Adugulatho
Kontey Kontey Chenukulatho, Kolimilanti Magatimitho
Sarasara Vacchinaadu Chicchara Pidugantivaadu
Edo Edo Thalachinaadu Evvarino Vethikinaadu
Evaranta… Evaranta… Evarevaranta
Evaranta Evaranta Evarevarevarevaranta

Kondapalli Endi Bomma
Kola Kallatho Chusindamma
Teeyateeyani Teynelakomma
Teeyani Teraley Teesindamma

Vajrala Jilugulunna
Rathnala Yelugulunna
Kempulla Ompulunna
Mohareela Merupulunna..
Naa Paidi Gundeylona Edi Puttinchi
Mariginchi Mariginchi Kariginchi Kariginchi

Kollagottinaadiro…..Kollagottinaadiro
Kollagotti Naa Gundeyney Mulleygattinaadiro
Kollagottinaadiro…..Kollagottinaadiro
Mulleygattinaadiro…Mulleygattinaadiro…

Narinnanno.. Narinnanno.. Narinnanno….
Narinna Narinnanno..

Ayyayyayyo Ayyayyayyo….
Aa Chinnadi.. Inkemi Chesindayyo
Ayyayyayyo Ayyayyayyo….
Aa Kurradi.. Aa Mantram Esindayyo..

Kannulaloni Kaatuka Megham
Seekati Naapai Silikindey
Maatalathoney Melikeysinde
Marmam Edo Daasindey

Aadavaalla Manasu Adavilantidani
Eragani Santodiva
Antha Amayakudiva
Padusupilla Teeru Pattusikkadani Pasigattalenodiva
Votti Shontikommuva…
Letha Ennapoosava…..

Are Meesala Roshala Monaganni Pattesi
Pasivanni Chesesi Pasaredo Poosesi…

Kollagottinaadiro…..Kollagottinaadiro
Kollagotti Naa Gundeyney Mulleygattinaadiro
Kollagottinaadiro…..Kollagottinaadiro
Mulleygattinaadiro…Mulleygattinaadiro…

Narinnanno.. Narinnanno.. Narinnanno….
Narinna Narinnanno..O

Hoy hoy hoy
Hoy hoy hoy hoy
Hoy hoy hoy
Hoy hoy hoy hoy

Oopiriloni Aaviripavanaaley
Viriviga Lekhaley Visireney
Uppena Laaga Pongey Pourushamey
Sogasuku Sankela Veseyney

Cheekuchintha Leni Vaadi Chittam Dochavey
Parahushaar Poragadni Paagal Chesavey
Daaredayina Davvedayina Needayi Untaney
Pereydaina Teeredayina Penimiti Antaney
Addeddedde….

Kollagottinaadiro…..Kollagottinaadiro
Kollagotti Naa Gundeyney Mulleygattinaadiro
Kollagottinaadiro…..Kollagottinaadiro
Mulleygattinaadiro…Mulleygattinaadiro…

Narinnanno.. Narinnanno.. Narinnanno….
Narinna Narinnanno..O

Narinnanno.. Narinnanno.. Narinnanno….
Narinna Narinnanno..O

________________

Song Credits:

పాట పేరు: కొల్లగొట్టినాదిరో (Kollagottinadhiro)
సినిమా : హరి హర వీరమల్లు ( Hari Hara Veera Mallu)
సంగీత దర్శకుడు: M. M. కీరవాణి (M. M. Keeravaani)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: మంగ్లీ (Mangli), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), రమ్య బెహరా (Ramya Behara), యామిని ఘంటసాల (Yamini Ghantasala).
కోరస్ : లోకేశ్వర్ ఈదర (Lokeshwar Edara), సాయి చరణ్ (Sai Charan), అరుణ్ కౌండిన్య (Arun kaundinya), ఐరా ఉడిపి (Airaa Udupi), లిప్సికా భాష్యం (Lipsika Bhashyam), వైష్ (Vaish)
నటీనటులు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నిధి అగర్వాల్ (Nidhi Agerwal),
దర్శకత్వం: జ్యోతి కృష్ణ (Jyothi Krisna) & క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)

See Aso from This Movie: Maata Vinaali song lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.