Kodanda Ramudanta Song Lyrics
కొదండ రాముడంట కోమ్మలాలా వాడు
కౌసల్యా కోమరుడంట కోమ్మలాలా
ఆజాను బాహుడంట అమ్మలాలా వాడు
అరవింద నేత్రుడంట అమ్మలాలా
రమణీయలామకు తగ్గ జోడువాడేనని
రహదారులన్నీ చెప్పుకోగా విని
కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని
కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా
ఈడు జోడు బాగా నే ఉంటుందండి
చూసాయగానే లగ్గాలే పెట్టించండి
ఎదీ ఇంకా అందాకా రాణీ రాణీ
పోనీ పోనీ మరి కొంచెం త్వరగా పోనీ
బాడీ మాత్రమే భేషుగ్గా కనబడుతుందీ
టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండీ
అడపా దడపా గాలి కొడితే సరిపోతుందీ
మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుందీ
వత్తనారు వత్తనారు అయ్యా బాబోయ్
వచ్చేత్తనారండోయ్
దొంగలో బండిపోట్లో వస్తున్నట్టు
ఆ గావు కేకలు ఏమిట్రా
వచ్చేది పెళ్లి వారేగా!
బాగుండయ్యో ముసలాయనా
వచ్చేది మగ పెళ్ళి వారు!
కబుర్లాడుతూ కూర్చోకా
ఈ కండువ వేసుకుని వీధిలోకి ఎదురు ఎల్లు
అన్ని యార్పాట్లు చేసానే ముసలీ
అయినా ఏది ఇంకా రాన్డే
ఆ వచ్చామండి మొత్తానికి వచ్చామండి
తెచ్చామండి అబ్బాయిని తెచ్చామండి
కారు పల్లకి మాకు కూడా తెచ్చామండి
పిల్లనంపిటే తీసుకునే వెళతామండి
అబ్బాయ్ మనం పెళ్లికి రాలేదు.
పెళ్లి చూపులకు వచ్చాం
నువ్వలా తొందర పడకు.
రండయ్య రండి పెళ్లి పెద్దలారా
అన్ని సిద్ధంగా ఉంచాం వచ్చి చూసుకోరా
కాఫీ ఫలహారాలవి కనిపిస్తారా
లేక అర్జెంటుగా అమ్మాయిని చూస్తారా
బాబాయ్, కుర్రాడు కాస్తా తొందర పడుతున్నాడు
అమ్మాయిని పిలిపించండి
వధువు వస్తున్నదీ
వధువు కాదు, అదేదో వింత వస్తువు.
బాబాయ్ నీ ఫేస్ అలా సైడుకి పెట్టి
అమ్మాయిని తీసుకురండి
వధువు వస్తున్నదీ
కొంచెం ఏజ్డ్‌గా ఉన్నట్టుంది
నీ మొహం ఆవిడ మా పిన్నీ.
పిన్నీ ఆలస్యం చేస్తే మావాడు
ఆడవాళ్లు అందర్నీ పెళ్లికూతుళ్లుగా
అనుకున్నట్టున్నాడు
అసలు హీరోయిన్‌ను తీసుకురండమ్మా
వధువు వస్తున్నదీ
అబ్బాయ్, వాయిదాలు వేయకుండా
జడ్జ్‌మెంట్ ఇచ్చేయి
అమ్మాయి నచ్చిందా?
ఒకే. నచ్చినట్టే నండీ
నసకకు, ఏం కావాలో అడుగు
పాట ఏమైనా వచ్చునేమో
కనుక్కొండి గురువుగారూ
హాహా పాట అటమ్మా
పాడేస్తే పొలా
కొదండ రాముడంట కోమ్మలాలా వాడు
కౌసల్యా కోమరుడంట కోమ్మలాలా
ఆజాను బాహుడంట అమ్మలాలా వాడు
అరవింద నేత్రుడంట అమ్మలాలా
రమణీయలామకు తగ్గ జోడువాడేనని
రహదారులన్నీ చెప్పుకోగా విని
కళ్యాణ రామయ్యను కన్నులారా చూడాలని
కలికి సీతమ్మ వేచే గుమ్మలాలా
సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండి
డివ్వి డివ్వి డివ్విట్టం తెచ్చిందండి
సువ్వి సువ్వి సుముహూర్తం వచ్చిందండి
డివ్వి డివ్వి డివ్విట్టం తెచ్చిందండి
రేపో మాపో పప్పన్నం పెడతామండి
ఊరు వాడా జనమంతా దీవించండి
Song Credits:
పాట: కోదండ రాముడంత
ఆల్బమ్/సినిమా: మావి చిగురు
ఆర్టిస్ట్ పేరు: జగపతి బాబు, ఆమని, రంజిత
గానం: S.P. బాలు, జగపతి బాబు, వందేమాతరం, ప్రసన్న కుమార్, అల్లు, శ్రీలేఖ, రేణుక
సంగీత దర్శకుడు: S.V. కృష్ణా రెడ్డి
గీత రచయిత: సీతారాం శాస్త్రి
సంగీతం లేబుల్: T-సిరీస్ సంగీతం
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.