Home » కోడలి ఉపాయం నీతి కథ

కోడలి ఉపాయం నీతి కథ

by Rahila SK
0 comments

రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్యకురాలు. కోడలు తనకు తెలియకొండ వంటింట్లో ఏమేమి తీసేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికీ వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుంనేది.

ఒక రోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ “పూల్లని దోసెలు చేసుకొని ఎర్ర కారంతో నుంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా” అని లలితతో అన్నది.
అప్పటి నుంచి లలితకు తను కూడా పూల్లని దోసెలు ఎర్ర కారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒక రోజు ఎర్ర కారం తయారు చేసుకుని, దోసెల కోసం పిండి రబ్బీ పెట్టుకున్నది. తీరా దోసె వేసుకోబోయేప్పటికీ పెనం మీద సూమ్ మని శబ్దం వచ్చిది. ఆ శబ్దం విని సూరమ్మ గబా గబా వంటింట్లోకి వచ్చి అమ్మ అమ్మ నాకు తెలియకుండా దోసెలు వేసుకుని తిటున్నవటే! అంటూ తిట్ట సాగింది. గబాగబా ఆ దోసెలు అన్ని తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు అప్పుడు ఏడుపు వచ్చింది. అయినా సేరె పూల్లని దోసెలు తినాలన్న ఆశ మాత్ర చంపుకోలేకపోయింది. నాలుగు రోజుల తర్వాత మళ్లి ఎర్ర కారం చేసి పెట్టుకుని, దోసెల పిండి రబ్బీ పెట్టుకుంది లలిత. పెనం మీద సూమ్ మని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగునా వంటింట్లోకి వచ్చింది ఆబ్బె దోసెలు కాదు అత్తయ్య! పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది.

మూడోసారి కూడా అలాగే చేయడంతో, దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు. అదే తనయితే చూపులతోనే కనిపెట్టస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్లి సూమ్ మని శబ్దం వచ్చిన సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసెలు వేసుకుని తినేసింది. ఇక ఆ తరువాత నుంచీ ఎప్పుడు దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత.

కథ యొక్క నీతి: మనల్ని భాధ పెట్టె వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయలతో తప్పించుకోవచ్చు. అనేది ఈ నీతి కథ.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలును సందర్శించండి.

You may also like

Leave a Comment