కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ
ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా… ఓ
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి
ఆశీస్సు అందేనురా
ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ
ఆ ప్రేమ పండేనురా..
కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు
శుభకరములు తన కరములు
వరమాలే ఇచ్చేరా
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా… ఓ
శ్రావణ ముహూర్తాలలో ప్రేమ ప్రమిదెలు వెలిగేరా
తాళాలు రేగంగ మేళాలు మోగంగ
మాంగల్యధారణరా
బంగరు మేఘాలురా రంగు పందిళ్లు వేసేయరా
కళ్లకు దిద్దంగా ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా
తారబొట్టు పెట్టేనూ తాళిబొట్టు అల్లేనూ
నింగి వేదికేసేనూ చూడ వేడుకయ్యేనూ
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లే జరిగేరా
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ
ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా… ఓ
Song Credits:
పాట పేరు: కథలో రాజకుమారి (Kathalo Rajakumari)
సినిమా పేరు: కళ్యాణ రాముడు (Kalyana Ramudu)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
సాహిత్యం: శ్రీ హర్ష (Sri Harsha)
నటీనటులు : వేణు (Venu), నిఖిత (Nikhitha)
గాయకుడు: K.J.యేసుదాస్ (K.J.Yesudas)
నిర్మాత: వెంకట శ్యామ్ (Venkata Shyam)
దర్శకుడు: రామ్ ప్రసాద్ (Ram Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.